Teja Sajja Mirai: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెక్కలు మొత్తం మారిపోయాయి… ప్రతి హీరో డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. ఎవరైతే మంచి కథలతో సినిమాలు చేస్తున్నారో ప్రేక్షకులు కూడా వాళ్లకే పట్టం కడుతున్నారు. స్టార్ హీరోల ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి కాన్సెప్ట్ బాగున్న మూవీస్ నే ప్రేక్షకులు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…ఇక వాళ్లకి నచ్చిన సినిమాని ఒకటికి పది సార్లు చూసి సూపర్ సక్సెస్ గా మలుస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన తేజ సజ్జా తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితో కలిసి నటించాడు. మరి అలాంటి నటుడు హీరోగా మారి జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు. ముఖ్యంగా ‘హనుమాన్ ‘ సినిమా అయితే పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించింది…హాలీవుడ్ లో వచ్చే సూపర్ మేన్ సినిమాకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో హనుమాన్ సినిమా ఉండటమే కాకుండా పలు రికార్డులను కూడా బ్రేక్ చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన మరోసారి ‘మిరాయ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మన దేశపు పురాణాలను అలాగే చరిత్రను కలిపి రాసుకున్న కథనే మిరాయ్…అటు పురాణాలను ఇటు చరిత్రను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు.
Also Read: తేజ సజ్జ తల్లిదండ్రులు ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా!
ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులందరు ఈ సినిమాను చూడడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తేజ సజ్జా సైతం ఈ సినిమాతో భారీ రికార్డ్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ప్రస్తుతం ఆయన 600 కోట్ల కలెక్షన్స్ ను కనక కొల్లగొట్టినట్టయితే టైర్ వన్ హీరోగా మారిపోతాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…మరి ఆయన టైర్ వన్ హీరోగా మారితే మాత్రం చాలా మంది స్టార్ హీరోలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
చాలా చిన్న ఏజ్ లో టైర్ వన్ హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకంటే మాత్రం అది నిజంగా వండర్ అనే చెప్పాలి. ఈ జనరేషన్ లో ఉన్న టైర్ వన్ హీరోలందరు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే కావడం విశేషం… తేజసజ్జ టైర్ వన్ హీరోగా అవతరిస్తే మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి టైర్ వన్ హీరోగా ఎదిగిన నటుడిగా తేజ సజ్జ గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు. చూడాలి మరి తేజ సజ్జ టైర్ వన్ హీరోగా మారతాడా లేదా అనేది..