Homeఎంటర్టైన్మెంట్Raja Saab OTT views first week: థియేటర్స్ లో డిజాస్టర్.. కానీ ఓటీటీ లో...

Raja Saab OTT views first week: థియేటర్స్ లో డిజాస్టర్.. కానీ ఓటీటీ లో ‘రాజా సాబ్’ కి మొదటివారం వచ్చిన వ్యూస్ ఎంతంటే!

Raja Saab OTT views first week: థియేటర్స్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచినా ఎన్నో సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాక మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం కూడా అదే కోవకు చెందనుందా? అంటే అవుననే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గానే ఏ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. తెలుగు తో పాటు ఈ చిత్రం అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి నేటి వరకు సోషల్ మీడియా లో ఈ చిత్రం పై వచ్చినన్ని ట్రోల్స్ ఏ సినిమా మీద కూడా రాలేదు. అయినప్పటికీ కూడా వ్యూయర్ షిప్ అదిరిపోయే రేంజ్ లో వచ్చిందని టాక్. విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి వారంలో మూడు మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట.

థియేటర్స్ లో ఎలాగో ఈ చిత్రాన్ని ఆడియన్స్ పెద్దగా చూడలేదు కాబట్టే, ఓటీటీ లో ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాకు ఓటీటీ లో ఎలాంటి రెఫాన్సే వస్తుందో, ఈ చిత్రానికి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఉండడం వల్లే, ఈ చిత్రానికి జియో హాట్ స్టార్ లో అంతటి వ్యూస్ వచ్చాయి. ఆయన నటించిన ‘సలార్’ చిత్రానికి ఇదే హాట్ స్టార్ యాప్ లో సెన్సేషనల్ వ్యూస్ వచ్చాయి. దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా ట్రెండ్ అయ్యింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది. అలా ఆయనకంటూ పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేకమైన ఆడియన్స్ ఉండడం వల్లే, ఈ చిత్రానికి ఈ రేంజ్ వ్యూస్ రావడానికి కారణం అయ్యాయని అంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాలను పూర్తి చేయడానికి తన ఫోకస్ మొత్తం పెట్టినట్టు తెలుస్తోంది. వీటిల్లో ముందుగా ‘ఫౌజీ’ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. కేవలం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అందుకు వంద రోజుల సమయం అవసరం ఉంటుంది. ఎలా అయినా ఈ చిత్రాన్ని దసరా కి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ‘స్పిరిట్’ విషయానికి వస్తే, ఇప్పటికే నాలుగు రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకుంది ఈ చిత్రం. త్వరలోనే డెహ్రాడున్ లో 15 రోజుల షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నాడు సందీప్ వంగ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular