Vijay Deverakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటే యూత్ లో యమ క్రేజ్. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నవాళ్లలో విజయ్ నిలుస్తారు. మొదట్లో సాధారణగా హీరోగా ఉన్న విజయ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత విజయ్ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే విజయ్ కొన్ని సందర్భాల్లో చేసే కామెంట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన నటించిన ప్రతీ మూవీ ఏదో విధంగా కాంట్రవర్సీలోకి మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ సారి అయన తనను పనిగట్టుకొని బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారని అన్నారు కూడా. ఇంతకీ ఈ యంగ్ హీరో ఎన్ని వివాదాల్లో చిక్కకున్నారో చూద్దాం..
విజయ్ దేవరకండ, సమంతలు కలిసి నటించిన ‘ఖుషి’ ఇటీవల రిలీజ్ అయింది. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా గురించి కొందరు రివ్యూలు సరిగా రాయలేదని మీడియా ముందు వాపోయాడు. రివ్యూలతో ప్రేక్షకులను థియేటర్లకు రానీయకుండా చేస్తున్నారని అన్నారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈయనకు స్టార్ డం తెచ్చిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా సమయంలో జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన వాడిన ఒక పదం వివాదానికి దారి తీసింది. దీంతో ఆయనపై యాంకర్ అనసూయ తో పాటు చాలా మంది సెలబ్రెటీలు కామెంట్స్ చేశారు.
అర్జున్ రెడ్డి సినిమాపై ఫిలిం కంపానియన్ ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో నటి పార్వతి విజయ్ ముందే నెగెటివ్ కామెట్స్ చేసింది. దీంతో ఆమెను ఉద్దేశిస్తూ.. ఆమె అభిప్రాయం ఆమెది.. అని అన్నారు. ఆయన నటించిన ‘నోటా’ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ సినిమా విడుదల సమయంలో వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ డైలాగ్ రైటర్ శశాంక్ వెన్నెలకంటిపై కేసు పెట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు పెద్ద గొడవనే చేశారు.
లైగర్ సినిమా సందర్భంగా మూవీ ప్రమోషన్ లో విజయ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన రూ.200 కోట్ల నుంచి మొదలుపెడుతున్నా.. అని అనడంపై ఇండస్ట్రీలో కొందరు విమర్శించారు. అంతకాకుండా ‘అయ్య తెల్వడు.. తాతా తెల్వడు’ అనడమూ వివాదంగా మారింది. ఇక ఇటీవల ‘ఖుషి’ సినిమా వియజోత్సవ కార్యక్రమంలో పాల్గొన విజయ్ తనకు వచ్చిన రెమ్యూనరేషన్ లో కోటి రూపాయల వరకు వంద ఫ్యామిలీస్ కు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీని రిలీజ్ చేసిన అభిషేక్ పిక్చర్స్ తమను కూడా ఆదుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం వివాదంగా మారింది.