NTR War 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తాను చాటుతూ ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు.. ఇక ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ లాంటి మల్టీస్టారర్ సినిమా చేసిన ఎన్టీయార్ ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
అయితే ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రావత్ అదిపురుషు సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన క్యారెక్టర్ గురించి పక్కాగా తెలుసుకున్న తర్వాతే రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. హృతిక్ రోషన్ ని మించేలా తన క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరి పాత్ర హైలెట్ అవుతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవ్వబోతున్నట్టుగా కూడా సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయనకి ఇప్పటికే భారీ మార్కెట్ అయితే ఉంది. దాన్నిబట్టి హృతిక్ రోషన్ మార్కెట్, ఎన్టీఆర్ మార్కెట్ కలిసి ఈ సినిమాకి భారీ బిజినెస్ ను చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఒకప్పుడు తెలుగు సినిమాలంటేనే పట్టించుకోని బాలీవుడ్ హీరోలు ఇప్పుడు మన హీరో ఉంటేనే వాళ్లకు మార్కెట్ పెరుగుతుంది అనే ఉద్దేశ్యం లోకి వచ్చారు అంటేనే, మన తెలుగు సినిమా స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మన తెలుగు హీరోల వాల్యూ ఎంతలా పెరిగిందో కూడా మనం తెలుసుకోవచ్చు.
మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోకసారి సక్సెస్ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హృతిక్ రోషన్ క్యారెక్టర్ పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ ని పోషిస్తున్నాడట. అలాగే ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా నిలువబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…