Meera Chopra: జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద కామెంట్లు చేసిన మీరా చోప్రా ఇప్పుడెలా ఉందంటే?

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు హీరోగా వచ్చిన ‘వాన’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ గా మిగిలినా.. ఇందులోని సాంగ్స్ హైలెట్ అయ్యాయి.

Written By: Chai Muchhata, Updated On : July 10, 2023 12:45 pm

Meera Chopra

Follow us on

Meera Chopra: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా తన సినీ కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేశాడు. ఆ మధ్య తమిళం రీమేక్ సినిమాలు వరుసగా చేసిన వాటిలో ‘బంగారం’ ఒకటి. ఇందులో జర్నలిస్టుగా నటించిన పవన్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఓ వైపు కామెడీ చేస్తూనే.. మరో వైపు సీరియస్ యాక్షన్ చేసిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలినా పవన్ మాత్రం తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదే మూవీలో పవన్ కు జోడీగా నటించింది మీరా చొప్రా. అప్పటి వరకు తమిళ సినిమాల్లో నటించిన మీరా చోప్రా.. ఫస్ట్ మూవీతోనే పవన్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించిన ఈ భామ ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో నిలవలేకపోయింది. కానీ ఇతర ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం మీరా చొప్రా ఫోటోలో సోషల్ మీడియాలో షాక్ ఇస్తున్నాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆమెను చూసి రకరాలుగా కామెంట్లు పెడుతున్నారు.

సుదేశ్ చొప్రా-నీలం చొప్రా దంపతుల కూతురే మీరా చోప్రా. ఈమె 1983 జూలై 8న జన్మించింది. బాలీవుడ్ లో స్టార్లుగా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలు ఈమెకు బంధువులవుతారు. సినీ రంగంపై ఆసక్తి ఉన్న మీరా చొప్రా ఎస్ జే సూర్య నటించిన ‘అబ్నే అరుయిరే ’ అనే తమిళం మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి 2005లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులోకి పవన్ కల్యాణ్ నటించిన ‘బంగారం’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బంగారం మూవీ సక్సెస్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తిరిగి తమిళంలో జాంబవన్, లీ, మరుధమలై, కాలే అనేసినిమాల్లో నటించింది.

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు హీరోగా వచ్చిన ‘వాన’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ గా మిగిలినా.. ఇందులోని సాంగ్స్ హైలెట్ అయ్యాయి. అలా మీరా చోప్రా గురించి మరోసారి చర్చించుకున్నారు. ఇక 2011 లో మారో, 2013లో గ్రీకువీరుడు అనే సినిమాల్లో కనిపించిన మీరా కు తెలుగులో అనుకున్న సక్సెస్ రాలేదు. దీంతో తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. చివరగా 2018లో నాస్తిక్ అనే హిందీ మూవీలో కనిపించింది. ఆ తరువాత వెండితెరకు దూరమైంది.

Meera Chopra

అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా చోప్రా.. తాజాగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆమె లేటేస్ట్ ఫొటోలు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బంగారం సినిమాలో ఎంతో అందంగా ఉన్న మీరా చోప్రా ప్రస్తుతం అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అయితే ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీలో దూమారం లేపిన విషయం తెలిసిందే. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఆమెపై తెగ ఫైర్ అయ్యారు.