Chalaki Chanti : జబర్దస్త్ వేదికగా ఎదిగిన స్టార్స్ లో చంటి ఒకరు. కమెడియన్ గా వెండితెరపై చంటి ప్రస్థానం మొదలైంది. భీమిలి కబడ్డీ జట్టుతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. అయితే చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. ఇక 2013లో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. చంటి ఎంట్రీ ఇచ్చాడు. చలాకీ చంటి అనే టీమ్ కి లీడర్ అయ్యాడు. ఏళ్ల తరబడి జబర్దస్త్ లో చంటి ప్రయాణం సాగింది. తన మార్క్ కామెడీతో తో చంటి బుల్లితెర స్టార్ అయ్యాడు. యాంకర్ గా ఒకటి రెండు షోలు చేశాడు. అడపాదడపా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు.
కాగా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడు. హౌస్లో చెడుగు ఆడుకుంటా అని హోస్ట్ నాగార్జునకు ప్రామిస్ చేశాడు. కానీ ఇంటి వాతావరణం, గేమ్స్, అక్కడి పరిస్థితులు చంటికి సెట్ కాలేదు. అందులోనూ అందరికంటే పెద్దోడు. టాస్క్స్ గేమ్స్ లో యాక్టీవ్ గా ఉండేవాడు కాదు. ఒక వారం నేను సరిగా ఆడలేకపోతున్నానని హోస్ట్ నాగార్జునకు చెప్పాడు. ఆ నెక్స్ట్ వీక్ చంటిని ఎలిమినేట్ చేశారు. నాలుగైదు వారాల్లో చంటి ప్రయాణం ముగిసింది.
తోటి జబర్దస్త్ కమెడియన్ ఫైమా మాత్రం అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ షోకి వచ్చిన వాళ్లకు మల్లెమాలలో రీఎంట్రీ ఉండదు. ఆయన స్టార్ మా ప్రోగ్రామ్స్ లో అప్పుడప్పుడు కనిపించేవారు. సడన్ గా చలాకీ చంటికి హార్ట్ అటాక్ అంటూ న్యూస్ బయటకు వచ్చింది. ప్రాణాపాయ స్థితి నుండి చలాకి చంటి బయటపడ్డారని సమాచారం. గత మూడు నెలలుగా చంటి బుల్లితెర మీద కనిపించలేదు.
తాజాగా చంటి సుమ అడ్డా షోలో ప్రత్యక్షమయ్యాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సిరి, సన్నీ, కాజల్, చంటి లేటెస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్నారు. చంటి పూర్తిగా కోలుకున్నట్లు లేదు. ఆయన బలహీనంగా కనిపించారు. బరువు తగ్గారు. అయితే తన మార్క్ పంచ్లతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత కనిపించిన చంటిని ఫ్యాన్స్ ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కోలుకున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. ఆయన తిరిగి బుల్లితెర మీద బిజీ కావాలని ఆశిస్తున్నారు.