Ibomma Piracy: ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి దర్శక నిర్మాతలు తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. డైరెక్టర్ ముందుగా ఒక కథను రాసుకొని దానికి సరైన విధంగా న్యాయం చేయడానికి విజువల్ గా దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే ఆయన చేసిన ఆ సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేయడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. కొత్త సినిమాలు రిలీజైన వెంటనే పైరసీ రూపంలో నెట్లో అందుబాటులోకి రావడం సినిమా ఇండస్ట్రీని గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తున్నాయి… ప్రస్తుతం ప్రతి కొత్త సినిమాకు సంబంధించిన పైరసీ ప్రింట్లైతే బయటికి వస్తున్నాయి. కొంతమంది సైబర్ పోలీస్ ఆఫీసర్లు సినిమాలను పైరసీగా మార్చే కొంతమందిని పట్టుకున్నారు. దానికి పోలీస్ ఆఫీసర్లు ఒక ఆపరేషన్ ని చేపట్టడం విశేషం…నిజానికి ఐ బొమ్మ వాళ్లు సినిమాను పైరసీ ఎలా చేస్తారు అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం…
ఇక పైరసీ ప్రింట్ ని తీసే వ్యక్తి ఒక థియేటర్ ను సెలెక్ట్ చేసుకొని అందులో ఏదో ఒక కార్నర్ సీట్ ను సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడి నుంచి స్క్రీన్ చాలా ఓపెన్ గా కనిపించే విధంగా చూసుకుంటాడు.
దానివల్ల ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కెమెరాలో స్టాండ్ బై అనే అప్లికేషన్ ని ఆన్ చేసి వీడియోని రికార్డ్ చేస్తాడు. నిజానికి స్టాండ్ బై అప్లికేషన్ ని ఆన్ చేసి జేబులో పెట్టుకుంటే మధ్యలో ఫోన్ అటు ఇటు కదిలిన ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా రికార్డు అవుతూ ఉంటుంది.
అందుకే దీన్ని స్టాండ్ బై అప్లికేషన్ అంటారు. ఇక వాళ్ళు వీడియో తీసినట్టుగా కూడా ఎవరికి తెలియదు. ఆ వీడియో తీసి దాన్ని ఒక ఆన్లైన్ లింకుగా ఏర్పాటు చేసి టెలిగ్రామ్ యాప్ ద్వారా వాళ్లకి పంపిస్తూ ఉంటారు. ‘సింగిల్’ సినిమా పైరసీ చేసిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు చాలా పకడ్బందీ ప్రణాళికతో పట్టుకున్నారు.
ఆయన చెప్పిన విషయాలను బట్టి ఒక సినిమా పైరసీ చేస్తే ఆయనకి 100 మంచి 200 డాలర్ల వరకు డబ్బులు ఇస్తారట… ఇక ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను బట్టి ఐ బొమ్మ సైట్ వాళ్లని పట్టుకోవాలని పోలీసులు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు చేసే ప్రయత్నంలో సఫలం అవుతారా? లేదా అనేది పక్కన పెడితే వాళ్ళను పట్టుకోవాలని పోలీసులు చేసే ప్రయత్నం చాలా గొప్పదనే చెప్పాలి…