Film Industry : సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేసే నటులు చాలా మంది ఉన్నారు. హీరోలుగా రాణించాలనుకున్న నటులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తూ ఉంటారు. ఇక దర్శకులు మాత్రం వాళ్ళ దర్శకత్వ నైపుణ్యాన్ని చూపించడానికి మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక హీరో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కొన్ని వందల మంది విజిల్స్ వేస్తూ, కేరింతలు కొడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఆ హీరో ఆ సినిమా కోసం ఎంతలా కష్టపడతాడనేది మాత్రం ఎవ్వరు అర్థం చేసుకోరు. అయినా కూడా సగటు ప్రేక్షకుడికి హీరో కష్టంతో పనిలేదు. వాళ్ళు టిక్కెట్ డబ్బులకి 3 గంటల పాటు హీరో తనని ఎంటర్టైన్ చేశాడా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని ఆడియన్స్ ఆ సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు…ఇలాంటి క్రమంలోనే ప్రొడ్యూసర్లు ఆయా సినిమాల మీద భారీగా డబ్బులను కుమ్మరిస్తూ ఒక బెస్ట్ సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ కి ఎంతవరకు నష్టం వస్తుంది. ఒక వేళ సినిమా సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ కి ఎంతవరకు లాభాలు వస్తాయి. ఒక సినిమా థియేటర్ యజమానికి గాని డిస్ట్రిబ్యూటర్ల కి గాని ఎంత లాభాలు వసస్థాయి. అది ఏ రూపంలో వస్థాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముఖ్యంగా ఒక సినిమా తీసేటప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కొంతమంది ఫైనాన్షాయర్స్ దగ్గర డబ్బులను తీసుకొని సినిమాని తెరకెక్కిస్తు ఉంటాడు. ఇక సినిమా మొత్తం పూర్తి అయి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫైనాన్షియర్స్ కి ఇంట్రెస్ట్ తో కలిపి డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఒక్కో ఏరియాను బట్టి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు ఆ సినిమాని చూపించి ఆ హీరోకి, దర్శకుడుకి ఉన్న మార్కెట్ ను బట్టి ప్రొడ్యూసర్ ఆ ఏరియాలో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో దాన్ని అంచనా వేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక రేట్ అయితే మాట్లాడుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్ కూడా తను ఒప్పుకున్న అమౌంట్ లో నుంచి 30% అమౌంట్ ని చెల్లించి ఆ సినిమా రైట్స్ ని తను సొంతం చేసుకుంటాడు.
ఇక మిగిలిన డబ్బులను సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తాడు… ఇక ఆయన దగ్గర నుంచి ఎగ్జిబ్యూటర్లు అంటే థియేటర్ యజమానులు వాళ్ళ ఏరియాలో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూసుకొని ఆ హీరో మార్కెట్ ను బట్టి ఒక రేట్ కి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఆ సినిమాను తీసుకుంటారు. వాళ్ళు ఒప్పుకున్న అమౌంట్లో కొంత పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించి సినిమా రైట్స్ ని తీసుకుంటారు. మొత్తానికైతే సినిమా రన్ అవుతున్నప్పుడు ఆ ప్రాఫిట్ లో ముందుగా మాట్లాడుకున్నట్టుగానే పర్సంటేజ్ ల ప్రకారం ఎగ్జిబ్యూటర్ల కి ఎంత డిస్ట్రిబ్యూటర్ కి ఎంత ప్రొడ్యూసర్ కి ఎంత అనేదాని ప్రకారం థియేటర్ యజమానుల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల వరకు డబ్బులు వెళ్తాయి. అయితే ఇందులో గ్రాస్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్, షేర్ కలెక్షన్స్ అంటూ మూడు రకాల కలెక్షన్స్ చూపిస్తూ ఉంటారు. గ్రాస్ కలెక్షన్స్ అంటే ధియేటర్లలో టికెట్ల మీద వచ్చిన మొత్తం కలెక్షన్స్…ఇక నెట్ కలెక్షన్స్ అంటే గవర్నమెంట్ కి ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ చెల్లించిన తర్వాత ఉండే కలెక్షన్స్… ఇక షేర్ ఎలక్షన్స్ అంటే థియేటర్ కి ఉన్న ఖర్చులను అంటే (రెంట్, విద్యుత్ చార్జీలు మిగిలిన ఖర్చులు) తీసేసిన తర్వాత మిగిలిన కలెక్షన్స్ ని షేర్ కలెక్షన్స్ అంటారు…
ఇక ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ విషయానికి వొస్తే ఇది ఒక్కో స్టేట్ లో ఒక్కోలా ఉంటుంది…నార్త్ లో 50%, ఉత్తర ప్రదేశ్ 60%, తమిళనాడు 25%, కేరళలో 24%, ఇక కన్నడ లో మాత్రం ఎలాంటి ఎంటర్ టైమ్ మెంట్ ట్యాక్స్ అయితే వేయడం లేదు..కానీ కన్నడ కాకుండా ఇతర భాషల సినిమాలను అక్కడ రిలీజ్ చేయాలంటే 70% వరకు పే చేయాల్సి ఉంటుంది…ఇక మన దగ్గర అయితే 12% మాత్రమే ఎంటర్ టైమ్ మెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇక ఇండియాలో అత్యంత తక్కువ ట్యాక్స్ పే చేస్తున్న ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ నే కావడం విశేషం…
ఇలా స్టెప్ బై స్టెప్ ఎగ్జిబ్యూటర్ల దగ్గర్నుంచి డిస్ట్రిబ్యూటర్ కి అలాగే ప్రొడ్యూసర్ దాకా టికెట్ డబ్బులు వెళ్తుంటాయి. నిజానికి ప్రొడ్యూసర్ తను పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రేట్ కే డిస్ట్రిబ్యూటర్లకు ఆ సినిమాలని అమ్ముతుంటారు. తద్వారా ఆయన సేఫ్ జోన్ లో ఉంటాడు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొంతవరకు ఆ నష్టాన్ని భరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే సినిమా మరీ డిజాస్టర్ గా మారితే మాత్రం ప్రొడ్యూసర్ కూడా కొంతవరకు నష్టాలు భరించాల్సిన అవసరమైతే ఉంది…ఇలా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లకి డబ్బులు అనేవి వస్తుంటాయి