మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నాడు వేమన. గొప్పోళ్ల జీవితాల్లో అన్ని చీకట్లే. ఎటు చూసినా అవే కనిపిస్తుంటాయి. బజారులో ఉన్న వాడికి బంగారు మనసుండొచ్చు. బంగ్లాలో ఉండే వాడికి బజారు బుద్ధి ఉండొచ్చు. బాగా సంపాదించిన వారి జీవితాలు తరచి చూస్తే అన్ని తప్పులే కనిపిస్తాయి. తాజాగా నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారంలో కూడా ఇలాంటివే కనిపిస్తున్నాయి. తన అందాలతో కనువిందు చేసిన నటిగా పేరున్న శిల్పాశెట్టి భర్తగా గుర్తింపు పొందిన రాజ్ కుంద్రా అరెస్టుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వెబ్ సిరీస్ పేరుతో యువతులకు ఎర వేసి అశ్లీల చిత్రాలు తీసే ఆయన చర్యలపై ఇప్పటికే పలు అనుమానాలు వస్తున్నాయి. గత ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణం గురించి బయటకు వచ్చినా ఇన్నాళ్లు జరిపిన పరిశోధనల ఫలితంగానే రాజ్ కుంద్రాపై కేసు బిగుసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరు బయటకు వచ్చి కుంద్రాపై విమర్శలు చేస్తున్నారు. హాట్ షాట్స్,హాట్ హిట్ మూవీస్ లాంటి బీ,సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేస్తున్నారనే విషయంలో కుంద్రాను కోర్టులో హాజరుపరచారు. అతడిని ఈనెల 23 వరకు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం పంపింది.
రాజ్ కుంద్రా శాలువాల వ్యాపారం చేసేవాడు. అందులో రూ. కోట్లు సంపాదించాడు. 2007లో దుబాయ్ వెళ్లి అక్కడ కన్ స్ర్టక్షన్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు. పలు వ్యాపారాలు నిర్వహించి బాగా సంపాదించాడు. 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా పలు మార్గాల్లో ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆమెను ఇంప్రెస్ చేసే ఉద్దేశంతో పలుమార్లు కలుస్తూ ఆమెకు దగ్గరైనట్లు చెబుతున్నారు.
రాజ్ కుంద్రా శిల్పాశెట్టిని కలిసినప్పుడల్లా ఏదో ఒక బహుమతి ఇచ్చేవాడట. దీంతో ఆమె పొంగిపోయి అతడి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన బ్యాగులను శిల్పకు పంపేవాడట. ఏ కలర్ ఇష్టముంటుందో తెలియక ఒక్కోసారి మూడు కలర్లు పంపేవాడట. ఈ నేపథ్యంలో ఆమె షాక్ కు గురై అతడి ప్రేమలో పడిందని చెబుతున్నారు. మొత్తానికి రాజ్ కుంద్రా ప్లాన్ వేసి మరీ ఆమెను దక్కించుకునేందుకు పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాగా అతడికి ఇది రెండో వివాహం.