https://oktelugu.com/

Mahesh Babu-Jr NTR: మహేష్ బాబు చేయాల్సిన బృందావనం సినిమా ఎన్టీఆర్ దగ్గరికి ఎలా వెళ్లిందంటే…

ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఏ హీరో తో సినిమా చేస్తున్నాడు అనేది ఇంకా తెలీదు కానీ ఆయన ప్రస్తుతం ఒక మంచి కథ రాసుకునే బిజీలో ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2023 / 12:24 PM IST
    Follow us on

    Mahesh Babu-Jr NTR: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరు. ఆయన ప్రభాస్ తో తీసిన మున్నా సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించనప్పటికీ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఆయన బృందావనం అనే సినిమా తీశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో చేసిన వారసుడు సినిమా తెలుగులో యావరేజ్ గా ఆడినప్పటికీ తమిళం లో మాత్రం సూపర్ హిట్ అయింది.

    ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఏ హీరో తో సినిమా చేస్తున్నాడు అనేది ఇంకా తెలీదు కానీ ఆయన ప్రస్తుతం ఒక మంచి కథ రాసుకునే బిజీలో ఉన్నాడు. ఇక స్వతహాగా వంశీ పైడిపల్లి మహేష్ బాబు కి మంచి ఫ్రెండ్ కావడం తో ఈయన ఎన్టీఆర్ తో చేసిన బృందావనం సినిమా స్టోరీని ముందుగా మహేష్ బాబు కి చెప్పడం జరిగింది.ఆ టైం లో అప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఖలేజా సినిమా బిజీలో ఉండడం వల్ల బృందావనం సినిమాని చేయలేకపోయాడు దాంతో అప్పుడు వంశీకి తర్వాత మనం ఒక సినిమా చేద్దామని మాట ఇచ్చాడు.

    దాంతో మహేష్ బాబు బృందావనం సినిమాని వదులుకొని ఆయన డైరెక్షన్ లో మళ్లీ మహర్షి సినిమా చేశాడు ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది దాంతో వంశీ పైడిపల్లి ఎప్పటినుంచో మహేష్ బాబుకి ఒక మంచి హిట్ ఇద్దామని అనుకున్నాడు. మహర్షి సినిమాతో ఒక సూపర్ డూపర్ హిట్ అయితే వంశీ పైడిపల్లి మహేష్ బాబు కి ఇవ్వడం జరిగింది.ఈ సినిమా ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు వసూళ్లను సాధించి మహేష్ బాబు కెరియర్ లో 100 కోట్లు సాధించిన సినిమాల్లో ఒకటి గా నిలిచింది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం బృందావనం సినిమా మహేష్ బాబు చేసి ఉంటే బావుండేది అని అంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఫ్యామిలీ కి సంబంధించిన స్టోరీ కాబట్టి మహేష్ బాబు అయితే సాఫ్ట్ లుక్స్ తో ఇంకా బాగుండేది అని వాళ్ళ అభిప్రాయం.

    మొత్తానికి మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీసి వాళ్ళ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు.ఇక ఈ సినిమా తర్వాత వారసుడు సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సింది కానీ ఆ స్టోరీ మహేష్ బాబు కి నచ్చకపోవడం తో అది రొటీన్ స్టోరీ కాన్సెప్ట్ కావడంతో మహేష్ బాబు ఆ సినిమాని వదులుకోవడం జరిగింది ఇక వీళ్ళ కాంబో లో మరో సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది…