Bimbisara Movie: ”ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాశిస్తే..
కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవొంచి బానిసలైతే..
ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది..
అదే త్రిగడ్తల రాజ్యపు నెత్తుటి సంతకం – బింబిసారుడి ఏక ఛాత్రాధిపత్యం”

పై డైలాగ్ లు వింటే.. ఏ ప్రభాస్ కో, లేక, ఏ మహేష్ బాబుకో రాసినట్టు అనిపిస్తుంది కదూ. నిజానికి ఇలాంటి డైలాగ్ లు మోయాలి అంటే.. మాస్ లో గొప్ప ఫాలోయింగ్ ఉండాలి. అలాగే ఆహార్యంలో గొప్ప ఆజానుబాహుడు అయి ఉండాలి. అప్పుడే ఇలాంటి డైలాగ్ లు పేలతాయి. కానీ కళ్యాణ్ రామ్ పై ఈ డైలాగ్ లు పోస్ట్ చేస్తే ఏమి బాగుంటుంది ?
అసలు కల్యాణ్ రామ్ కత్తి పట్టుకుని చేసే విన్యాసాలు ఎవరికీ కావాలి ?. నందమూరి అభిమానులు మాత్రం ఆ విన్యాసాలను ఎంతవరకు అని చూస్తారు. ఎలాగూ బాలయ్య, ఎన్టీఆర్ అలాంటి విన్యాసాలే కదా చేసేది. మళ్ళీ కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు ఆ విన్యాసాల మీదే పడితే ఏమి ఉపయోగం ? అయినా మగధీర, బాహుబలి సినిమాల కన్నా గొప్పగా ఏమి చూపిస్తారు ఈ సినిమాలో.
దీనికి తోడు కల్యాణ్ రామ్ క్యారెక్టర్‌లో నెగిటీవ్ ఛాయలు ఉంటాయట. సాఫ్ట్ పాత్రల్నే కళ్యాణ్ రామ్ కరెక్ట్ గా పోషించలేడు అని టాక్ ఉంది. అలాంటిది ఇక నెగిటివ్ పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తాడు ? పైగా ఈ బింబిసార సినిమా పూర్తిగా కత్తి – డాలు టైపు కథతో సాగుతుంది. అలాగే కథలో రెండు కోణాలున్నాయట.
అయినా కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా కనిపించడమే కష్టం, ఇక నటించి మెప్పించడం ఎలా ? అన్నట్టు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట. పాన్ ఐడియా లెవల్ లో స్కోప్ ఉందట. స్కోప్ ఉన్నా మార్కెట్ ఉండక్కర్లేదా ? మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. ఏది ఏమైనా ‘నందమూరి కళ్యాణ్ రామ్’ సినిమాల సెలెక్షన్ మొదటినుండి విభిన్నంగానే సాగుతుంది.
Also Read: Bimbisara Movie: నందమూరి కళ్యాణ్ రామ్ “బింబిసారా” సినిమా టీజర్ విడుదల…
విజయమో, వైఫల్యమో – ఏదీ పట్టించుకోకుండా ప్రయోగాల చేస్తూనే వెళ్తుంటాడు కల్యాణ్ రామ్. కొత్త కథల్ని తెరకెక్కించడం అంటే తనకు భలే సరదా. బింబిసార కూడా అలాంటి ప్రయత్నమే. కానీ రిజల్ట్ కూడా రెగ్యులర్ గానే వస్తే.. కళ్యాణ్ రామ్ కి భారీ నష్టాలు ఉంటాయి. అప్పుడు ఎన్టీఆర్ కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. మరి చివరకు బింబిసార ఏం చేస్తాడో చూడాలి.
Also Read: Nandamuri Balakrishna: ఇన్నేళ్లకు బాలయ్య అంటే ఏమిటో అర్థం అయింది !