కింగ్ నాగార్జున.. టాలీవుడ్ మన్మథుడు నాగ్ 60ఏళ్ల వయస్సులోనూ ఫుల్ బీజీగా ఉన్నాడు. బుల్లితెరపై హోస్టుగా చేస్తూనే వెండితెరపై యాక్షన్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. నాగార్జున కొడుకులు నాగచైతన్య.. అఖిల్ కంటే కూడా ఆయనే వరుస సినిమాలతో లేటు వయస్సులో తన సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కరోనా సమయంలో సీనియర్ హీరోలంతా సినిమాలు చేసేందుకు జంకుతుంటే నాగార్జున మాత్రం అందరి కంటే ముందే షూటింగులకు రెడీ అయ్యాడు. ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్న సమయంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా నిలిచిపోయింది. ఆ సమయంలో నాగార్జున ‘బిగ్ బాస్’ను మొదలు పెట్టాడు.
Also Read: ‘లవ్ స్టోరీ’ రెడీ.. మరి రిలీజ్ పరిస్థితేంటి ?
ఓవైపు ‘బిగ్ బాస్’కు హోస్టుగా చేస్తునే మరోవైపు తన ‘వైల్డ్ డాగ్’ మూవీకోసం ఇటీవల కులుమానాలి వెళ్లాడు. కొన్నిరోజులు షూటింగులో పాల్గొని వీకెండ్ నాటికి హెలిక్టాప్టెర్ లో హైదరాబాద్ కు చేరుకొని మళ్లీ బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. కొన్నిరోజులు వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసిన నాగ్ ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.
వీకెండ్స్ లో బిగ్ బాస్ చేస్తూనే మధ్యలో ముంబాయిలో ఓ సినిమా షూటింగులో పాల్గొనేందుకు మళ్లీ సిద్ధపడుతున్నాడు. నాగ్ చాలా ఏళ్ల తర్వాత హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగులో గ్యాప్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండటంతో నాగార్జున షూటింగులో పాల్గొనేందుకు సిద్ధపడుతున్నాడు.
Also Read: కరోనా క్రైసిస్ నుంచి మల్టిపెక్సులు కోలుకుంటాయా?
‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున పాత్ర అరగంటపాటు ఉండదనుందని టాక్. ఈ మూవీలో రణబీర్ కపూర్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. లేటు వయస్సులోనూ నాగార్జున యంగ్ హీరోలకు, సీనియర్ హీరోలకు పోటీ ఇస్తుండటంపై ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.