Citadel Honey Bunny Teaser: చూడటానికి చాలా సింపుల్ గా ఉండే సమంత సబ్జక్ట్స్ ఎంపికలో సత్తా చాటుతుంది. ఆమె సక్సెస్ కి కూడా కారణం ఇదే. డిజిటల్ సిరీస్లు చేయాలన్న ఆలోచన ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత శ్రీలంకకు చెందిన తమిళ్ రెబల్ రోల్ చేసింది. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలతో కూడిన ఆ పాత్ర ఒప్పుకోవడానికి మిగతా హీరోయిన్స్ సంకోచిస్తారు. అలాగే రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించాల్సి ఉంటుంది. సవాళ్ళను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించి భారీ ఫేమ్ రాబట్టింది.
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో మరో ప్రధాన పాత్ర చేసిన మనోజ్ బాజ్ పాయ్ సమంత నటన, కమిట్మెంట్, హార్డ్ వర్క్ పై ప్రశంసలు కురిపించాడు. ది ఫ్యామిలీ మ్యాన్ కి మించిన రిస్కీ రోల్ చేసిందిసమంత. హనీ బన్నీ సిరీస్లో ఆమె సీక్రెట్ ఏజెంట్ పాత్ర చేసింది. హనీ బన్నీ హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ అని సమాచారం. ఇండియన్ నేటివిటీకి తగ్గట్లు హనీ బన్నీ లో కొన్ని మార్పులు చేశారు.
సిటాడెల్ సిరీస్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రలు చేశారు. హనీ బన్నీలో సమంత, వరుణ్ ధావన్ నటించారు. హనీ బన్నీ వెబ్ సిరీస్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 7నుండి హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో హనీ బన్నీ టీజర్ విడుదల చేశారు. రిచ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో టీజర్ ఆకట్టుకుంది.
ముఖ్యంగా సమంత లుక్ అద్భుతం అని చెప్పాలి. సీక్రెట్ ఏజెంట్ గా ఆమె చాలా స్టైలిష్ గా ఉంది. సిటాడెల్ లో ప్రియాంక చోప్రా-రిచర్డ్ మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు ఉన్నాయి. హనీ బన్నీలో కూడా వరుణ్ ధావన్-సమంత రొమాన్స్ చేశారు. అయితే డోసు తగ్గించారు. కొన్ని లిప్ లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ లు హాలీవుడ్ చిత్రాలను తలపిస్తున్నాయి.
బీజీఎమ్ మరో హైలెట్. మొత్తంగా హనీ బన్నీ టీజర్ అద్భుతంగా ఉంది. అంచనాలు పెంచేసింది. హనీ బన్నీ సిరీస్ కథ విషయానికి వస్తే… సమంత, వరుణ్ ధావన్ సిటాడెల్ అనే ఏజెన్సీలో సీక్రెట్ ఏజెంట్స్ గా పని చేస్తుంటారు. ఓ సీక్రెట్ మిషన్ కోసం వెళ్లిన సమంత, వరుణ్ ధావన్ ఇరుక్కుపోతారు. ట్రాప్ చేశారని తెలుసుకుంటారు. శత్రువుల నుండి తప్పించుకునే క్రమంలో వరుణ్ ధావన్ మెమరీ కోల్పోతాడు.
8 ఏళ్ల తర్వాత సీక్రెట్ ఏజెంట్స్ డీటెయిల్స్, న్యూక్లియర్ బాంబ్ కోడ్స్ తో కూడిన బ్లాక్ బాక్స్ బయటపడిందని ఓ టెర్రరిస్ట్ గ్రూప్ కి తెలుస్తుంది. దాని కోసం వారు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్, సమంత మరల కలిశారా? వారిద్దరూ శత్రువులకు ఎలా చెక్ పెట్టారు అనేది మిగతా కథ? ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే హనీ బన్నీ తెరకెక్కించారు. కేకే మీనన్ కీలక పాత్ర చేశారు.