
Actress Meena: సీనియర్ హీరోయిన్ ‘మీనా’ అంటేనే.. హోమ్లీ బ్యూటీ అని పేరు. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్న సమయంలోనే మీనా ఎప్పుడు హద్దులు మీరి పరిధి దాటలేదు. కానీ ఓ వెబ్ సిరీస్ కోసం తాజాగా ఆమె ఒక బోల్డ్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ వయసు అయిపోయినా.. ఇప్పటికి ఆమెలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అంటూ తమిళ డైరెక్టర్ జీవన్, ‘మీనా’ మెయిన్ లీడ్ గా ఒక సిరీస్ చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు.
మీనా(Actress Meena) లో మునపటి నటన, ఆ పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు. అవకాశం రావాలే గానీ, ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటుంది. అందుకే మేకర్స్ కూడా మీనా ఉత్సాహాన్ని చూసి ఆమెనే మెయిన్ లీడ్ గా పెట్టి.. వెబ్ సిరీస్ లను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో తెరకెక్కనున్న ఈ సిరీస్ లో మీనా హౌస్ వైఫ్ గా నటించబోతుంది.
నిజానికి ఈ సిరీస్ లో సీనియర్ బోల్డ్ హీరోయిన్ టబు నటించాల్సింది. రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చి.. టబు ఈ సిరీస్ నుంచి తప్పుకుంది. మొత్తానికి ఈ సిరీస్ లోకి మీనా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే కథ విని తానూ హీరోయిన్ గా నటించడానికి రెడీ అంటూ ఈ సిరీస్ కి మీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సిరీస్ చాలా బోల్డ్ గా ఉండబోతుందని టాక్ నడుస్తోంది.
మరి బోల్డ్ సిరీస్ తో హోమ్లీ బ్యూటీ ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. మరోపక్క మేకర్స్ మాత్రం యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సిరీస్ ను తీయాలని ఫిక్స్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో మీనా స్లీవ్ లెస్, షార్ట్స్ లో కనిపించాల్సి వస్తోందట. మొత్తానికి మీనా వైవిధ్యమైన కథలో తన నటనను మరోసారి సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించడానికి సన్నద్ధం అవుతుంది.
ఇక మీనా ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఒక తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. లేటు వయసులో కూడా గ్యాప్ లేకుండా సినిమాలో చేస్తూ ముందుకు పోతుంది మీనా.