Cannes Film Festival 2024: కేన్స్‌లో భారతీయ సినిమా సత్తా.. ఫస్ట్‌ ప్రైజ్‌ గెలుచుకున్న చిత్రం!

చిదానంద.ఎస్‌.నాయక్‌ తెరకెక్కించిన సన్‌ ఫ్లవర్‌ ఫర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో షార్ట్‌ ఫిలిం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 17 సినిమాలతో పోటీపడింది.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 2:10 pm

Cannes Film Festival 2024

Follow us on

Cannes Film Festival 2024: ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో భారత్‌ సినిమా సత్తా చాటింది. సన్‌ ఫ్లవర్స్‌ ఫర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో షార్ట్‌ ఫిల్మ్‌ 2024కు ఉత్తమ షార్ట్‌ ఫిల్మగా బహుమతి గెలుచుకుంది.

17 చిత్రాలతో పోటీపడి..
చిదానంద.ఎస్‌.నాయక్‌ తెరకెక్కించిన సన్‌ ఫ్లవర్‌ ఫర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో షార్ట్‌ ఫిలిం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 17 సినిమాలతో పోటీపడింది. ఈ రేసులో భారతీయ సినిమా మొదటి బహుమతి అందుకుంంది. ప్రపంచవ్యాప్తంగా 555 షిల్మ్‌ స్కూల్స్‌ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల నిడివితో ఉన్న ఈ షార్ట్‌ పిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.

యూకే చిత్రానికి మూడో బహుమతి..
ఇదే విభాగంలో బన్నీహుడ్‌ అనే యూకే షార్ట్‌ ఫిలిం మూడో బహుమతి సాధించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్ర నిర్మాత మహేశ్వరి రూపొందించారు. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్‌ ఫిలిం అవార్డు గెలుచుకున్న టీంకు 15,000 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్‌ ఫిలిం టీంలకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.