https://oktelugu.com/

Avengers: ‘అవెంజర్స్ సినిమాటిక్ యూనివర్స్’ లో ఈసారి విలన్ గా వస్తున్న స్టార్ హీరో….

ప్రపంచ సినిమా ను సాశిస్తున్న ఒకే ఒక ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ... ఇక్కడ నుంచి వచ్చే సినిమాలు ప్రపంచ వ్యాప్తం గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాయి....

Written By:
  • Gopi
  • , Updated On : July 28, 2024 / 06:16 PM IST

    Avengers

    Follow us on

    Avengers: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రేక్షకుడి ఆలోచన ధోరణికి ఏమాత్రం అందుకుండా వైవిద్య భరితమైన సినిమాలను చేయడంలో వాళ్లది అందవేసిన చేయి అనే చెప్పాలి. ఇక ఒకప్పుడు మన సినిమాలు రొటీన్ రొట్ట కమర్షియల్ ఫార్ములాలో సాగుతున్న సమయంలోనే వాళ్లు భారీ చిత్రాలను తెరకెక్కించి విజువల్ వండర్స్ ని తీశారు. అందుకే హాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తుదంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని సినిమాల గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ సినిమాల్లో నటించిన నటీ నటులు పోషించిన పాత్ర ఒక కేటగిరి ప్రేక్షకుడినే కాకుండా పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా అందర్నీ మెప్పించింది. ఇక ఇదిలా ఉంటే చాలా మంది ‘ఐరెన్ మ్యాన్’ పాత్ర కోసం ఎదురు చేస్తూ ఉంటారు…ఇక ఈ పాత్రను పోషించడం ద్వారా రాబర్ట్ డౌనీ జూనియర్ వరల్డ్ వైడ్ అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు… ఇక ఇదిలా ఉంటే ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ లో ప్రపంచాన్ని కాపాడబోతు ఆయన చనిపోయాడు.

    ఇక దాంతో ఐరన్ మ్యాన్ అభిమానులందరూ చాలా వరకు తీవ్రమైన నిరాశకు గురయ్యారనే చెప్పాలి. అయితే తను మరోసారి సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించబోతున్నట్టుగా కూడా సమాచారమైతే అందుతుంది. ఇక ఇప్పుడు వస్తున్న ‘అవెంజర్స్ డూమ్స్ డే’ సినిమాలో తను డూమ్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది…ఇక అలాగే ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ని చేసిన రూసో బ్రదర్స్ ఈ సినిమాను కూడా డైరెక్షన్ చేస్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు పాజిటివ్ క్యారెక్టర్ లో అదరగొట్టిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ లో మరోసారి ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమాను రీసెంట్ గా ఎనౌన్స్ చేశారు. కాబట్టి 2026 వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి… ఇక ఇంతకుముందు అవెంజర్స్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలన్నీ ఓకత్తైతే ఇప్పుడు వస్తున్న ఈ సినిమా మరొక ఎత్తు అంటూ దర్శక నిర్మాతలు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అవెంజర్స్ సినిమాటిక్ యూనివర్స్ సీరీస్ ని చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా సినిమాల మీద చాలావరకు ఆసక్తి నైతే చూపిస్తున్నారు. ఇక మొత్తానికైతే అవెంజర్స్ నుంచి మరొక సినిమా వస్తుంది అని తెలిసిన ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఆనందపడుతున్నారనే చెప్పాలి.

    ఇక ఈ సినిమాతో మరోసారి హాలీవుడ్ స్టాండర్డ్ అనేది నెక్స్ట్ లెవల్ కి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అవెంజర్స్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడనే కాదు హాలీవుడ్ సినిమాలు ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఎప్పటినుంచో చాలా వరకు ప్రభావితం చేస్తూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఫిదా అయిపోయిన మన అభిమానులు మరోసారి అవెంజర్స్ సిరీస్ నుంచి వచ్చే కొత్త సినిమాను కూడా ఆదరించడానికి రెడీగా ఉన్నారు…