https://oktelugu.com/

Hollywood : డెడ్ పూల్ అండ్ వాల్వేరిన్’ మూవీ మొదటి రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...అక్కడి నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : July 27, 2024 / 02:19 PM IST
    Follow us on

    Hollywood : హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు మొదటి రోజే భారీ కలెక్షన్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి అలాంటి సందర్భంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ‘డెడ్ పూల్ అండ్ వాల్వేరన్’ సినిమా ఎలాంటి వసూళ్లను రాబట్టింది అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఇక హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు మన ఇండియన్ ఇండస్ట్రీ మీద కూడా చాలా సంవత్సరాల నుంచే భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ వస్తున్నాయి… ఇక మన జనాలు ఆ సినిమాలను చూడటానికి అమితమైన ఇష్టాన్ని చూపిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే విధంగా రీసెంట్ గా రిలీజ్ అయిన ‘డెడ్ పూల్ అండ్ వాల్వేరన్’ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కి పోటీగా తెలుగులో గాని ఇండియన్ స్క్రీన్ మీద గాని ఎలాంటి సినిమాలు రిలీజ్ కాలేదు. అది కూడా ఈ సినిమాకి ఒక వంతుకు ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. ఇండియా వైడ్ గా ఈ సినిమా 21.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి…నిజానికి హాలీవుడ్ లో గుర్తింపు పొందిన జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్టీల్ బర్గ్ లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఎలాంటి వసూళ్ళనైతే రాబడతాయో ఈ సినిమా కూడా అలాంటి ఒక భారీ వసూళ్లను రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    ఇక ఇప్పుడప్పుడే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాలు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈ సినిమా ఈ వీకెండ్ భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే పలు చోట్ల ఈ సినిమాకి సంబంధించిన థియేటర్స్ ని కూడా పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఇండియాలో ఎంత కలెక్షన్లను వసూలు చేస్తుంది. అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించారనే చెప్పాలి… ఇక ఇంతకుముందు హాలీవుడ్ సినిమా వస్తుందంటే మన సినిమా ప్రేక్షకులు మొత్తం ఆసక్తితో ఎదురు చూసేవారు ఇంకా ఇప్పుడు కూడా ఈ సినిమా విషయంలో అంతకుమించిన అంచనాలతో ఎదురుచూశారు. ఇక ఈ సినిమాకి ఇండియాలో మంచి అంచనాలు ఉండడం అలాగే ఆ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా కూడా రూపొందడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ ను రాబట్టడం లో చాలా కీలక పాత్ర వహించారు… హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్ తో మన సినిమాలను కూడా హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు.

    కాబట్టి ఇటు మన సినిమాలని హాలీవుడ్ సినిమాలని చూస్తూ ఏక తాటిపైన ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతూనే ఆ సినిమాలకు భారీ కలెక్షన్లను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఈ సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో మరికొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఇక మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు మన సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను కూడా విపరీతంగా ఆదరిస్తూ ఉండడం నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి…