David Fincher: ‘జురాసిక్ పార్క్ ‘ లాంటి సినిమా తీయాలనుంది అంటున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్…

ఏ ఇండస్ట్రీ ప్రేక్షకులనైన సరే మంత్ర ముగ్ధులను చేయగలిగే కెపాసిటీ ఉన్న సినిమాలు హాలీవుడ్ సినిమాలు...ఇక వీటిని తెరకెక్కించడానికి ఆ డైరెక్టర్లు చాలా కష్టపడుతూ అంటారు...

Written By: Gopi, Updated On : July 24, 2024 1:35 pm

David Fincher

Follow us on

David Fincher: హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సినిమాలు చేయడంలో లేట్ అయినప్పటికీ వాళ్ళ సినిమాలు మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాయి. ఎక్కడ కూడా ఏ మిస్టేక్ జరగకుండా సినిమాని వాళ్ళు అనుకున్న రీతిలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.ఇక ఆ సినిమాల కోసం ప్రపంచ ప్రేక్షకులందరు చాలా ఎగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఒక అద్భుతమైన విజువల్ వండర్ ని చూసిన అనుభూతిని పొందుతూనే ఆ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో హాలీవుడ్ డైరెక్టర్స్ అందరు ఎక్కువగా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ ఉంటారు. ఇక డేవిడ్ ఫించర్ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తూ వచ్చాడు. తను చేసిన సినిమాల్లో ఎక్స్ ప్రెస్ యువర్ సెల్ఫ్, వోగ్, గేమ్, ఫైట్ క్లబ్, ద కిల్లర్ లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లో సాధించాయి. ఇక అందులో భాగంగానే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే సస్పెన్స్ జోనర్లను తెరకెక్కించడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ప్రతి సినిమాని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపిస్తూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అవుతూ వచ్చాడు. ఇక ఈయన ఇప్పుడు ‘స్టీవెన్ స్టీల్ బర్గ్ ‘ తీసిన ‘జురాసిక్ పార్క్’ లాంటి ఒక సినిమాని తీయాలని ఉందని తన మనసులోని మాటను తెలియజేశాడు. ఇక అందులో భాగంగానే అలాంటి సినిమా తీయడానికి తను సన్నాహాలను కూడా చేసుకుంటున్నట్టుగా ఒక సందర్భంలో తెలియజేశాడు.

మరి ఆయన ఇప్పుడు అలాంటి ఒక గ్రాఫికల్ వండర్ ను తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి డేవిడ్ ఫించర్ లాంటి దర్శకుడు హాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకుల సరసన ఇతను కూడా నిలుస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఆయన జురాసిక్ పార్క్ లాంటి ఒక హైలీ గ్రాఫికల్ సినిమాను చేయాలని ఉంది అని చెప్పడం పట్ల పలువురు సినీ విమర్శకులు పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు.

జురాసిక్ పార్క్ అనేది స్టీవెన్ స్పిల్ బర్గ్ యొక్క అద్భుతమైన సృష్టి దాన్ని ఎవరు పడితే వాళ్ళు చేస్తే అలాంటి ఒక ఫీల్ క్రియేట్ అవ్వదు అంటూ ఆయన మీద కొన్ని విమర్శలతో చేస్తున్నారు. మరి మొత్తానికైతే డేవిడ్ ఫించర్ అలాంటి సినిమా చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఆయన మీద తీవ్రమైన విమర్శలు రావడం అనేది ఒక రకంగా చాలా బాడ్ అనే చెప్పాలి…

కానీ ఆయన మాత్రం ఫ్యూచర్ లో ఎలాగైనా సరే ఒక భారీ గ్రాఫికల్ ఓరియెంటెడ్ మూవీని మాత్రం తప్పకుండా చేస్తానని తెలియజేసినట్టుగా చాలా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే హాలీవుడ్ మేకర్స్ ఎలాంటి సినిమా చేసిన కూడా మన ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి రెడీ గా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం… ఇక వాళ్ల స్ఫూర్తి తోనే మన ఇండియన్ డైరెక్టర్లు కూడా గ్రాఫిక్స్ తో కూడిన పెద్ద ప్రాజెక్ట్ లను కూడా చేస్తూ ముందుకు సాగుతున్నారు…