https://oktelugu.com/

Deadpool And Wolverine Review: ‘డెడ్ పూల్ అండ్ వాల్వెరైన్’ ఫుల్ మూవీ రివ్యూ…

ఈ వారం 'డెడ్ పూల్ అండ్ వాల్వెరైన్' అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..సక్సెస్ సాధించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : July 26, 2024 / 12:56 PM IST

    Deadpool And Wolverine Review

    Follow us on

    Deadpool And Wolverine Review: హాలీవుడ్ సినిమాలు వస్తున్నాయంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సినిమాలు విజువల్స్ గా సృష్టించే ప్రభంజనం అలాంటిది. కాబట్టి వాళ్ళ సినిమాను చూడడానికి ఆ విజువల్స్ ని ఎంజాయ్ చేయడానికి, ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ సినిమాల కోసమే ఎదురు చూస్తారు. మరి ఇలాంటి క్రమంలో ఈ వారం ‘డెడ్ పూల్ అండ్ వాల్వెరైన్’ అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..సక్సెస్ సాధించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వేడ్ వెల్సన్ టైమ్ ట్రావెల్ డివైజ్ కేబుల్ ద్వారా 10005 ఎర్త్ నుంచి 616 కు వెళ్లి అక్కడ ఉన్న హోగన్ ను కలిసి ఎలాగైనా సరే మీరు అవేంజర్స్ ను కలవండి అని రీక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక సరిగ్గా ఇదే సమయానికి తన గర్ల ఫ్రెండ్ వెనేసా తో బ్రేకప్ అయిన తర్వాత డెడ్ పూల్ ఆ డ్రెస్ ను తీసేసి అక్కడే కార్ సెల్స్ మేన్ గా చేరుతాడు. మరి అక్కడి నుంచి హోగన్ వేడ్ తో కలిసి డెడ్ పూల్ అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాడా? లేదా అసలేం జరిగింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    డైరెక్టర్ ‘షాన్ లేవి’ ఈ సినిమాని స్టార్ట్ చేసిన విధానం చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమాని స్టార్ట్ చేసి అదే ఇంట్రెస్ట్ ని క్యూరియాసిటీ ఎక్కడ మిస్ చేయకుండా సినిమా మొత్తం కంటిన్యూ చేస్తు ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఆయన పాత్రలను మలుచుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా చూడటానికి మాత్రం ఒక కన్నుల పండుగగా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటివరకు మనం చూసిన హాలీవుడ్ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. దర్శకుడు విజన్ కి అనుగుణంగా విజువల్స్ ని ఆడ్ చేస్తూ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.

    ప్రతి చిన్న విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా ను చాలా ఎక్స్ట్రాడినర్ గా తీసిన విధానం అయితే ప్రేక్షకులందరిని కట్టిపడేస్తుంది…ఇక కొన్ని సీన్లల్లో యాక్షన్ తో పాటు కామెడీ ని కూడా జనరేట్ చేస్తూ సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు…సెకండాఫ్ మొత్తాన్ని చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లి దర్శకుడు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో మాత్రం కొద్దిగా డల్ అయినట్టుగా అనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే దర్శకుడు వాటిని డీల్ చేసిన విధానం కూడా ప్రతి ఒక్కరి హార్ట్ కి టచ్ అవుతుందనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రతి నటుడు కూడా తన పూర్తి ఎఫర్ట్ పెట్టీ నటించారనే చెప్పాలి. ముఖ్యంగా డెడ్ పూల్ క్యారెక్టర్ ని పోషించిన ‘ర్యాన్ రెనాల్డ్స్’ మాత్రం ఈ సినిమాకి ప్రాణం పోశాడు. సినిమా మొత్తాన్ని తను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇతనికి స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అయిన నటించే నటన చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించేలా ఉంది… ఇక వాల్వేరైన్ గా చేసిన ‘హ్యూజ్ జాక్ మాన్’ కూడా నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక అందువల్లే ఈ సినిమా దీంతో ఒక ఎమోషనల్ బాండింగ్ తో నడవడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఎక్కడ తగ్గకుండా ర్యాన్ రెనాల్డ్స్ , హ్యూజ్ జాక్ మాన్ ఇద్దరు కూడా ఇరగదీసారనే చెప్పాలి…ఇక మిగిలిన ఆర్టీసులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించినప్పటికీ కెమెరా వర్క్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక సినిమాటోగ్రాఫర్ ప్రాణం పెట్టి చేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లో అయితే ఆయన అందించిన విజువల్స్ టాప్ నాచ్ లో ఉన్నాయి. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉంది. ఎక్కడ ఎంతవరకు ఏ సీన్ ఉండాలో అంతవరకు మాత్రమే ఉంది. ఇక షార్ప్ ఎడిట్ కట్ చేసి సినిమాని క్రిస్పీగా తయారు చేయడమే కాకుండా బోర్ కొట్టించకుండా ఎంగేజ్ చేసే విధంగా ఎడిటింగ్ అయితే ఉంది. ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎడిటింగ్ కూడా చాలా కీలక పాత్ర వహించిందనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే హాలీవుడ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు ఏది చేసిన కూడా టాప్ నాచ్ లో ఉండే విధంగానే ప్రొడక్షన్స్ ని సమకూరుస్తూ ఉంటారు. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు…

    ప్లస్ పాయింట్స్

    కథ
    ర్యాన్ రెనాల్డ్స్ , హ్యూజ్ జాక్ మాన్ ల యాక్టింగ్..

    డైరెక్షన్

    మైనస్ పాయింట్స్

    గ్రాఫిక్స్ వర్క్ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది…
    కొన్ని అనవసరమైన క్యారెక్టర్లు

    రేటింగ్
    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5

    చివరి లైన్
    ఈ వీకెండ్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు…