https://oktelugu.com/

Kingdom Of The Planet Of The Apes: వేల కోట్లు కొల్లగొట్టిన భారీ హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది… యాక్షన్ లవర్స్ అసలు మిస్ కావొద్దు? ఎక్కడ చూడొచ్చు?

కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రానికి వెస్ బాల్ దర్శకత్వం వహించాడు. ఒవేన్ విల్లియన్స్ టీగు, ప్రేయ అల్లన్, కెవిన్ డురండ్ కీలక రోల్స్ చేశారు. మనుషులు, చింపాజీల మధ్య పరస్పరం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : July 26, 2024 / 05:32 PM IST

    Kingdom Of The Planet Of The Apes

    Follow us on

    Kingdom Of The Planet Of The Apes: యాక్షన్ ప్రియులు హాలీవుడ్ చిత్రాలంటే చెవి కోసుకుంటారు. ఆ స్థాయిలో మన ఇండియన్ సినిమాల్లో యాక్షన్ డోస్ ఉండదు. గ్రాఫిక్స్ మాయాజాలంతో కళ్ళు చెదిరే విజువల్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ కట్టిపడేస్తాయి. అయితే హాలీవుడ్ చిత్రాలు అన్ని సందర్భాల్లో థియేటర్స్ లో అందుబాటులో ఉండవు. అలాగే ఈ చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు చూడరు. దాంతో థియేట్రికల్ రన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి థియేటర్స్ లో మిస్ అయితే ఆ మూవీని చూడటం కష్టమే.

    అయితే ఓటీటీ వచ్చాక ఆ సమస్య తీరింది. హాలీవుడ్ భారీ చిత్రాలు సైతం నెల నుండి రెండు నెలల వ్యవధిలో ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టిన కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఓటీటీలోకి వచ్చేసింది. సమ్మర్ కానుకగా మే 10న విడుదల చేశారు. 2017లో విడుదలైన వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రానికి ఇది కొనసాగింపు. ఆ సిరీస్లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నాలుగు ఇన్స్టాల్మెంట్.

    కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రానికి వెస్ బాల్ దర్శకత్వం వహించాడు. ఒవేన్ విల్లియన్స్ టీగు, ప్రేయ అల్లన్, కెవిన్ డురండ్ కీలక రోల్స్ చేశారు. మనుషులు, చింపాజీల మధ్య పరస్పరం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మంచి చింపాజీలు ఆమెకు ఎలా సహాయం చేశాయి. ఆమె లక్ష్యం నెరవేరిందా? అనే ఆసక్తికర అంశాలతో కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రూపొందించారు.

    $160 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రూపొందించారు. అంటే దాదాపు రూ. 13 వందల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ $ 396.7 మిలియన్ వసూళ్ళు అందుకుంది. ఇండియన్ కరెన్సీలో రూ. 3321 కోట్లు రాబట్టింది.కాగా కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి అయ్యింది. దీంతో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నారు.

    కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుంది. కాగా ఆగస్టు 2 నుండి కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఒరిజినల్ ఇంగ్లీష్ తో పాటు ఇండియాలోని పలు ప్రాంతీయ భాషల్లో కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ స్ట్రీమ్ కానుంది.

    ఇది యాక్షన్ మూవీ లవర్స్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. కేవలం మరో వారం రోజుల వ్యవధిలో ఈ చిత్రం మీ ఇంట్లో బుల్లితెర మీద ప్రత్యక్షం కానుంది.