Devara movie song : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా పై అంతటి హైప్ ఏర్పడడానికి ఎన్టీఆర్ క్రేజ్ ఎంత ఉపయోగపడిందో, అనిరుద్ అందించిన సంగీతం కూడా అంతే ఉపయోగపడింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ పాట చార్ట్ బస్టర్ లాగా నిల్చింది. ఇంస్టాగ్రామ్ లో ఈ పాటలపై మిలియన్ల కొద్దీ వ్యూస్ రీల్స్ చేస్తూ యూత్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసారు. ముఖ్యంగా ‘చుట్టమల్లే చుట్టేసావే’ అనే పాట అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది. ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తూ ఉండేది. యూట్యూబ్ లో ఈ పాటకు దాదాపుగా 300 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. విడుదల తర్వాత వీడియో సాంగ్ కి 83 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఈ పాట కి ఉన్న క్రేజ్ బౌండరీలు కూడా దాటి, ఇతర దేశాలకు పాకింది అనే విషయం నిన్ననే తెలిసిందే. ప్రముఖ బ్రిటీష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ నిన్న బెంగళూరు సిటీ లో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఈవెంట్ లో ఆయన ‘చుట్టమల్లే’ పాటను పాడి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసాడు. ఈ వీడియో ని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేస్తూ బాగా వైరల్ చేశారు. అనిరుద్ అందించిన సంగీతం దేశాలను దాటి ఇంతటి రీచ్ ని సంపాదించుకుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీనిని అనిరుద్ ట్విట్టర్ లో రీట్వీట్ చేయగా, జూనియర్ ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘సంగీతానికి హద్దులు లేవు. ఆ విషయాన్నీ మరోసారి మీరు నిరూపించి చూపారు. మా దేవర చిత్రంలోని చుట్టమల్లే పాట మీ నోటి నుండి రావడం ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కేవలం అనిరుద్ కారణంగా దేవర చిత్రం లో అనేక సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. థియేటర్స్ లో ఆ సన్నివేశాలను చూస్తున్నప్పుడు అద్భుతమైన అనుభూతి కూడా కలిగింది. అలాంటి అనిరుద్ కి ఈ మాత్రం గౌరవం దక్కడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2 ‘ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.
Wow This is Crazyyy Reach #Chuttamalle from @edsheeran ❤️❤️@DevaraMovie @anirudhofficial @tarak9999 #Devara pic.twitter.com/RdhDmTvu60
— Tony (@NMeklaNTR) February 9, 2025