Baahubali 2 Scenes Copied: మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు రాజమౌళి గారు..మగధీర సినిమా నుండే ఆయన దేశవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించాడు..ఇక ఆ తర్వాత ఆయన తీసిన ఈగ చిత్రం టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టించింది..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తీసిన బాహుబలి సిరీస్ వల్ల మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభ ప్రపంచం నలుమూలల పాకింది.

ఇక #RRR సినిమా తో మన తెలుగు సినిమా రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మన కళ్ళతోనే రోజు చూస్తున్నాం..హాలీవుడ్ సినిమాల్లోని సన్నివేశాలు చూసి మనం కాపీ కొట్టే రేంజ్ నుండి..మన సినిమాల్లోని సన్నివేశాలు చూసి హాలీవుడ్ వారు కాపీ కొట్టే రేంజ్ కి మన ఇండస్ట్రీ ఎదిగిపోయింది..అది కూడా వాళ్ళు రాజమౌళి సినిమాలోని సన్నివేశాన్ని కాపీ కొట్టడమే ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద సెన్సషనల్ టాపిక్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి పార్ట్ 2 సినిమాలో సెకండ్ హాఫ్ అప్పుడు ప్రజా దర్బార్ లో అనుష్క చేతులకు సంకెళ్లు వేసి, రానా సేతుపతిని మరియు అనుష్క ని విచారిస్తున్న సమయం లో ప్రభాస్ వచ్చి సేతుపతి తల నరికే సన్నివేశం అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్ గా మారింది..ఆ సన్నివేశాన్ని ఇప్పుడు హాలీవుడ్ లో పాపులర్ వెబ్ సిరీస్ ‘గేమ్స్ అఫ్ థ్రోన్’ లో వాడుకున్నారు..ఇటీవలే ప్రసారం చేసిన ఎపిసోడ్ లో ఈ సన్నివేశం ని మనం చూడవచ్చు..దీనిని బట్టి చూస్తుంటే హాలీవుడ్ టెక్నిషియన్స్ మన తెలుగు సినిమాలను..ముఖ్యంగా రాజమౌళి గారి సినిమాలను బాగా ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.

బాహుబలి సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అనేది మన అందరికి తెలిసిందే..ఇప్పటికి ఈ చిత్రం ఇండియాలో ఆల్ టైం టాప్ 1 గ్రాస్ గా కొనసాగుతుంది..సుమారు 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా ని రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ #RRR కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది అంటే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ పరంగా బాహుబలి స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు