Hit 3 Movie Collection: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit :The Third Case) థియేటర్స్ లో విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. నాని కెరీర్ లో అత్యంత భారీ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రంగా నిల్చిన ఈ సినిమా కేవలం వీకెండ్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ మూడవ వారం వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి రోజుకి 18 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుందంటే నాని కి లాంగ్ రన్ లో ఎంత కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని నెట్ ఫ్లిక్స్ సంస్థ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించింది. జూన్ 5న అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించినప్పటికీ ప్రతీ రోజు షేర్ వసూళ్లు వస్తున్నాయంటే సాధారణమైన విషయం కాదు. ఇక మూడు వారాల్లో ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 18 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ లో 5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. వారం రోజులు గడవకముందే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ సినిమా, ఈ సీడెడ్ ప్రాంతం లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది. ఉత్తరాంధ్ర లో ఈ చిత్రానికి సీడెడ్ లో కంటే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. 3 వారాల్లో దాదాపుగా 5 కోట్ల 35 లక్షల రూపాయిలు ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి వచ్చాయి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల 30 లక్షలు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 90 లక్షలు, కృష్ణా జిల్లాలో 2 కోట్ల 62 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1 కోటి 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 41 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 12 కోట్ల 60 లక్షలు, ఇతర భాషలకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్, ఓవరాల్ గా 63 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు, 119 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.