‘Hit 2’ record overseas : క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పర్చుకున్న హీరో అడవి శేష్..థ్రిల్లర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అడవి శేష్ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు.. మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్ ఇప్పుడు ‘హిట్ 2’ చిత్రం తో మన ముందుకి రాబోతున్నాడు.

డిసెంబర్ 2 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని న్యాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించాడు..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఉత్కంఠని నెలకొల్పిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు అమితంగా ఎదురు చూస్తున్నారు..ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఇక అడవి శేష్ హీరోగా నటించిన గత చిత్రం ‘మేజర్’ మంచి వసూళ్లను రాబట్టడం తో ‘హిట్ 2 ‘ చిత్రానికి ఓవర్సీస్ బయ్యర్స్ నుండి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఈ చిత్రాన్ని కేవలం అమెరికా లోనే 450 కి పైగా లొకేషన్స్ లో విడుదల చెయ్యబోతున్నారు..ఇది మాములు విషయం కాదు..ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఇక్కడ ఈ రేంజ్ లో విడుదల అవుతాయి.
మొట్టమొదటిసారి వాళ్ళ సినిమా కాకుండా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఆ స్థాయిలో విడుదల అవుతుంది అంటే అడవి శేష్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమా హిట్ అయితే కేవలం అమెరికా నుండే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట..మరి ట్రేడ్ లో ప్రేక్షకుల్లో ఈ స్థాయి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.