NTR-Charan: అత్యంత భారీ మల్టీస్టారర్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ కోసం తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాగుంది. కానీ ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా. మరి పాన్ ఇండియా సినిమా రేంజ్ లో ఈ సినిమాకు ఆదరణ ఉందా ? ఎందుకు ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు ? లోపం సినిమాలో ఉందా ? లేక, ప్రమోషన్స్ లో ఉందా ?

బాహుబలి విషయంలో ఇలా లేదు. అన్ని భాషల వాళ్ళు ఆ సినిమాను అక్కున చేర్చుకుని ఆదరించారు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది పరిస్థితి. ఈ సినిమా నుంచి ఏ టీజర్ వదిలినా, ఏ సాంగ్ వదిలినా పాజిటివ్ వైబ్స్ కంటే నెగిటివ్ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఉదాహరణకు హిందీలోనే తీసుకుందాం. ఈ సినిమా నుంచి మూడో పాటగా వచ్చిన జననీ సాంగ్ బాగుంది.
అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పలేం గానీ, కచ్చితంగా బాగుంది అని సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. పైగా ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా కూడా బాగా హైలైట్ అయ్యారు. అయినా ఎందుకో హిందీలో ఈ సాంగ్ ను అక్కడ పీఆర్వో టీమ్, అలాగే కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ హైలైట్ చేయడానికి ఇష్టపడలేదు.
Also Read: బాలయ్య చేతికి అలా కావడానికి నేనే కారణం- బోయపాటి
అయితే, ఇందుకు కారణం… అక్కడ హీరోల ఇగోలు, అసూయలే కారణం అని అర్థం అవుతుంది. హిందీలో కూడా స్టార్స్ మధ్య పెద్దగా ఐక్యత ఉండదు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో వాళ్ళు చాలా ఐక్యంగా ఉన్నారట. బాహుబలితో ప్రభాస్, మనకు పోటీ అయ్యాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రూపంలో మరో ఇద్దరు హీరోలు పోటీ అవుతారు. పైగా టాలెంట్ విషయంలో ఎన్టీఆర్ తో మనం పోటీ పడలేం.
కాబట్టి ఆర్ఆర్ఆర్ ను హిందీలో హిట్ కాకుండా చూడాలి అని, హిందీ హీరోలు ఫిక్స్ అయ్యారట. మరి జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాకి హిందీలో ఓపెనింగ్స్ వస్తాయా ? రావా ? అనేది ఇప్పుడు మేకర్స్ పెద్ద టెన్షన్ అయిపోయింది. ఏది ఏమైనా “ఆర్ఆర్ఆర్” థియేట్రికల్ ట్రైలర్ పైనే అందరి చూపులు ఉన్నాయి. ట్రైలర్ అద్భుతం అనే టాక్ వస్తే.. సినిమాకి హిందీలో కూడా ఊపు రావొచ్చు.
Also Read: ఎన్టీఆర్ అటు బాలయ్య ఇటు… మెగా ఫ్యామిలీతో నందమూరి బంధం భలే ఉందే!