Highest Grossing Telugu Movies 2021: తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’ అని చెప్పాడు. ఆ పిక్చర్‌తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా కలిగిన లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ఆ సినిమాతో పాటు అంతటి రేంజ్‌లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు చిత్రాలూ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఏ సినిమా అయినా అది చేసిన వసూళ్ల ఆధారంగా హిట్టా కాదా అనేది పరిగణిస్తుంటారు. అలా ఆ లెక్కన చూసుకుంటే బాహుబలితో సమానంగా పలు తెలుగు చిత్రాలు చక్కటి లాభాలు తీసుకొచ్చాయి. అవేంటంటే..‘బాహుబలి’ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చక్కటి బిజినెస్ చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన వలన రూ.860 కోట్లు వచ్చాయి. అందులో ఈ సినిమాకు అయిన ఖర్చును తీసేస్తే కనుక మొత్తంగా రూ.508 కోట్ల లాభాలు వచ్చాయి. ‘బాహుబలి 2’ చిత్రానికీ అత్యధిక వసూళ్లు వచ్చాయి. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రానికి రూ.831 కోట్ల షేర్ వచ్చింది. 2017 సంవత్సరంలో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఈ మూవీ నిలిచింది.

‘బాహుబలి’ సిరీస్ ఫిల్మ్స్ పక్కనబెడితే.. ‘అలవైకుంఠపురములో’ చిత్రానికి కూడా మంచి లాభాలు వచ్చాయి. 2020 సంవత్సరంలో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రానికిగాను రూ.75.88 కోట్ల లాభం వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ పిక్చర్‌లో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది. రౌడీ హీరో విజయ్ దేవర కొండ నటించిన ఫిల్మ్ ‘గీత గోవిందం’ కూడా చక్కటి బిజినెస్ చేసింది. ఈ చిత్రం ద్వారా రూ.55.43 కోట్ల లాభం వచ్చింది.


సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ కూడా మంచి వసూళ్లు చేశాయి. ఈ సినిమాకు రూ.50 కోట్ల లాభాలు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఫిల్మ్ ‘రంగస్థలం’. ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. 2018లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం ఓవరాల్ గా రూ.47.52 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి రూ.39 కోట్ల లాభం రాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీకి రూ.33 కోట్ల లాభం వచ్చింది. నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి రూ.50 కోట్ల లాభంగా రాగా, మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రానికి రూ.31 కోట్ల లాభం వచ్చింది.


Also Read: F3 షూటింగ్ జర్నీ పూర్తయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!

