Homeఎంటర్టైన్మెంట్సోనూ సూద్ కు హైకోర్టులో చుక్కెదురు !

సోనూ సూద్ కు హైకోర్టులో చుక్కెదురు !

Sonu Sood
కరోనా పుణ్యమా అని సోనూ సూద్ అంటే.. సేవా కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రెస్ అనే పేరు వచ్చేసింది. అయితే సోనూసూద్కు బాంబే హైకోర్టులో చుక్కెదురవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులపై పది వారాల సమయం కావాలన్న సోనూసూద్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చుతూ.. ఇప్పటికే మీ పిటిషనర్కు చాలా సమయమే లభించిందని వ్యాఖ్యానిస్తూ తీర్పును ఇచ్చింది. సోనూసూద్‌ ముంబయిలోని తన నివాస భవనం శక్తిసాగర్‌ను అవసరమైన అనుమతులు తీసుకోకుండా హోటల్‌ భవనంగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read: మహేష్ బాబు కసరత్తులు.. ‘రాజమౌళి కోసమేనా?

దాంతో ఆయనకు బీఎంసీ నోటీసులు పంపింది. తన తప్పు లేదు అన్నట్టూ సోనూసూద్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించింది. ఇక దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ… తాను భవనాన్ని హోటల్ గా మార్చడానికి బీఎంసీ పర్మిషన్ తీసుకున్నానని.. అందుకు సంబంధించిన పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపాడు. అయితే.. కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్మిషన్ రావాల్సి ఉందన్నాడు.

Also Read: తన ప్రియుడు పై పెళ్లి పై హీరోయిన్ ముచ్చట్లు !

దీనికి కూడా దరఖాస్తు చేసుకున్నానని కరోనా కారణంగానే ఈ అనుమతి ఇంకా రాలేదని.. ఒకవేళ అనుమతి రాకుంటే తన హోటల్ ను తీసేస్తానని ఆయన తెలిపాడు. పాపం మంచి చేసి కొంతమంది రాజకీయ నాయకులకు సోనూసూద్ విలన్ అయిపోయాడు. ఏది ఏమైనా కరోనా వల్ల దేశం అల్లకల్లోలం అయినప్పటి నుండి సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్‌లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు. సాయం కోరని వాళ్లకు అందరికీ తన వంతు సాయం చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular