https://oktelugu.com/

 Allu Arjun : అల్లు అర్జున్ కి హైకోర్టు లో ఊరట.. ఈ మధ్యంతర బెయిల్ రావడానికి కారణం ఆయనేనా..?

ప్రస్తుతం అల్లు అర్జున్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోవడం ఆ కేసుకు అల్లు అర్జున్ తో ముడిపడి ఉండడం పట్ల ఆయన చాలావరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక నాంపల్లి కోర్టులో 14 రోజుల పాటు అతనికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కానీ అనుకోకుండా అతనికి ఇప్పుడు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు అయింది...

Written By:
  • Gopi
  • , Updated On : December 13, 2024 / 06:20 PM IST

    Bail Grants to Allu Arjun

    Follow us on

    Allu Arjun : ప్రస్తుతం అల్లు అర్జున్ కి హైకోర్టులో ఊరట లభించింద. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క విచారణను విన్న తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్లు అర్జున్ ను ఏ11 గా పరిగణించారు. అలాగే అతను ఈరోజు 1:30 నిమిషాలకు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రిమాండ్ నివేదికలో తెలిపారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి క్వాశ్ పిటిషన్ ను దాఖలు చేశారు..అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళుతున్నానని పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్ ఆ థియేటర్ యాజమాన్యానికి తెలియజేశారని చెప్పాడు. ఇక రాత్రి 9:40 నిమిషాలకు సినిమా చూడడానికి సంధ్య థియేటర్ కి వెళ్లినట్టుగా కూడా తెలియజేశారు. ఆయన 2వ అంతస్తులో ఉండి సినిమాని చూశారు. ఇక ఎవరైతే చనిపోయారో ఆ మహిళ మొదటి అంతస్తులో ఉన్నట్టుగా వాళ్ళు ధ్రువీకరించారు. ఇక మొత్తానికైతే ఆయన వాదనను విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ కింద అల్లు అర్జున్ బెయిల్ అయితే మంజూరు చేశారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అభిమానులు కొంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి.

    ఇక పరిమిత కాలం పాటు ఆయనకు మధ్యంతర బేయిల్ మంజూరు చేసినట్టుగా హైకోర్టు అయితే తీర్పించింది. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ కి కొంతవరకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రిమాండ్ కి పంపిస్తే అల్లు అర్జున్ తరఫున న్యాయవాది క్వాశ్ పిటిషన్ కింద హైకోర్టు లో పిటిషన్ దాకలు చేయడంతో ఈ మధ్యంతర బేయిల్ అనేది మంజూరు అయింది.

    ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కొంత వరకు ఆనందంగా ఉన్నాడనే చెప్పాలి… మరి మళ్లీ ఈ కేసు ఎక్కడ దాకా వెళుతుంది అనేది ప్రజెంట్ అయితే తెలియని పరిస్థితి ఉన్నప్పటికి 14 రోజుల రిమాండ్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ తో పాటు అతని అభిమానులు, తన కుటుంబ సభ్యులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి. కానీ హైకోర్టులో అతనికి ఊరట లభించడం పట్ల యావత్ తెలుగు సినిమా అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా తన వల్ల ఒక ప్రాణం పోయింది అనే బాధని భరిస్తూ ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ కి ఈ కోర్టు జైలు శిక్ష అనేది కూడా మరింత దిగ్బ్రాంతికి గురి చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం పట్ల తన తరపు న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి చాలా వరకు బాగా పోరాడాడనే చెప్పాలి…