https://oktelugu.com/

Hi Nanna Twitter Review : ట్విట్టర్ రివ్యూ.. నాని ‘హాయ్ నాన్న’ సినిమా ఎలా ఉందంటే.?

దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. కాగా ఈ సినిమా ఈనెల 7వ తేదీన విడుదలకు సిద్ధమైంది.

Written By: , Updated On : December 7, 2023 / 10:28 AM IST
Hi Nanna Child Artist

Hi Nanna Child Artist

Follow us on

Hi Nanna Twitter Review : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో టైంలో ఒక్కో రకమైన సినిమాల ట్రెండు నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు లవ్ స్టోరీస్ నడిస్తే మరి కొన్నిసార్లు థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా నడుస్తుంటాయి.ఇక ఇప్పుడు అనే కాదు ఎప్పుడు వచ్చిన నడిచే ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫుల్ స్టోరీస్ కొన్ని ఉంటాయి అందులో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు మొదటి వరుస లో ఉంటాయి…

హాయ్ నాన్న సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘hi నాన్న’ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడడం అప్పుడే టాక్ బయటకు వచ్చింది. ముఖ్యంగా నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు.

సినిమా చాలా బాగుందని కొందరు.. ఎమోషనల్ సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇక సెకండాఫ్ బాగా ల్యాగ్ అయ్యిందని.. దీనిపై మరింత దృష్టి పెట్టాలని మరికొందరు స్పందిస్తున్నారు.

దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. కాగా ఈ సినిమా ఈనెల 7వ తేదీన విడుదలకు సిద్ధమైంది.