HHVM movie story: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం సరిగ్గా వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవుతున్న మొట్టమొదటి సినిమా ఇది. ఎన్నో కష్టనష్టాలను ఎదురుకొని ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కి ముందు వరకు కూడా అభిమానుల్లోనే ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదలై ఈ సినిమా రేంజ్ ఎలాంటిదో ఆడియన్స్ కి అర్థం అయ్యేలా మేకర్స్ చేయడంతో అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో మంచి విషయమే ఉందని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా కథ గురించి అభిమానుల్లో చాలా సందేహాలు ఉన్నాయి.
Also Read: అంబానీతో పోటి.. ఆ చెట్టు కోసం ‘కోటి’ పెట్టిన ప్రభాస్.. ఏంటది?
విజయనగరం సామ్రాట్ పాలనలో హరి హర వీరమల్లు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనది గొప్ప చరిత్రనే. కానీ ఆయన ఉన్న కాలం లో ఔరంగజేబు పుట్టలేదు. కానీ ఇందులో ‘హరి హర వీరమల్లు’ కి ఔరంగజేబు కి మధ్య యుద్ధం అన్నట్టు చూపించారు, అంటే చరిత్ర ని వక్రీకరించారా? అనే సందేహాలను నిర్మాత AM రత్నం వ్యక్తం చేయగా, ఆయన అందుకు క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘హరి హర వీరమల్లు’ అనేది కేవలం ఒక ఫిక్షనల్ క్యారక్టర్ మాత్రమేనని, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం హరి (విష్ణువు), హర( శివుడు) అనుగ్రహం తో పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు పెట్టామని, ఇది పూర్తిగా ఫిక్షనల్ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా ట్రైలర్ లో చూపించిన విధంగా నిజాం రాజు కూడా ఔరంగజేబు కాలం నాటి వాడేనని, నిర్మాత AM రత్నం చెప్పుకొచ్చాడు.
Also Read: మహేష్ బాబు – చిరంజీవి కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవేనా..?
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఒక ఫైట్ సన్నివేశం కోసం ముందుగా తెల్లవారు జామున చార్మినార్ కి వెళ్లి చిత్రీకరించాలని అనుకున్నారట. కానీ అక్కడ అయితే పూర్తి స్థాయి స్వేచ్ఛ తో ఇష్టమొచ్చినట్టు తియ్యలేమనే ఉద్దేశ్యంతో చార్మినార్ సెట్ ని నిర్మించి, అక్కడ ఈ సన్నివేశాలను చిత్రీకరించారట. చార్మినార్ సైజుని పర్ఫెక్ట్ గా కొలిచి ఈ సెట్ నిర్మాణం చేశారని, అందుకోసం దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చెయ్యాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు AM రత్నం. ట్రైలర్ లో హైలైట్ గా అనిపించిన షాట్స్ అన్ని చార్మినార్ సీక్వెన్స్ కి సంబంధించినవే. థియేటర్ లో ఈ సీన్ ఆడియన్స్ చేత కచ్చితంగా విజిల్స్ వేయించేలాగానే ఉంది. కేవలం చార్మినార్ సెట్స్ మాత్రమే కాదు, గోల్కొండ సెట్స్, ఎర్ర కోట సెట్స్, ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలను మనం ఈ సినిమాలో చూడవచ్చు.