Heroine Trisha : సుమారుగా రెండున్నర దశాబ్దాల నుండి సౌత్ ఇండియా లో ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ కి పోటీ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నటువంటి హీరోయిన్స్ లిస్ట్ లో త్రిష కచ్చితంగా ఉంటుంది. తెలుగు తమిళ భాషల్లో ఈమె సీనియర్ హీరోల దగ్గర నుండి, నేటి తరం స్టార్ హీరోల దగ్గర వరకు అందరితో కలిసి సినిమాలు చేసింది. కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాదు. ఎక్కువశాతం సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ గా కూడా ఈమె పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమె అజిత్, విజయ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేస్తుందంటే, నేటి తరం యూత్ ఆడియన్స్ కూడా ఆమెని ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా ఈమె సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం.
ఈ మేరకు ఆమె ఒక నిర్ణయానికి కూడా వచ్చేసినట్టు చెప్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఆమె ఒక స్థానం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆమె తమిళ హీరో విజయ్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి అనేక సార్లు ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లొస్తూ, దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. తనపై వచ్చే రూమర్స్ కి వెంటనే రియాక్షన్ ఇచ్చే అలవాటు ఉన్న త్రిష, ఈ రూమర్ పై మాత్రం మౌనం వహించింది. బలంగా మా మధ్య అలాంటివి ఏమి లేదని ఇప్పటి వరకు ఆమె చెప్పలేకపోయింది. విజయ్ గత ఏడాది తమిళనాడులో ‘తమిళగ వెట్రి కజఖమ్’ అనే రాజకీయ పార్టీ ని స్థాపించాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు.
ఈ పార్టీ లోకి త్రిష అధికారికంగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియా లో నడుస్తున్న చర్చ. తమిళనాడు లో ఈ పార్టీ క్యాండిడేట్ గానే త్రిష పోటీ చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటకి రాబోతుందట. ప్రస్తుతం ఆమె చేతిలో అటు తమిళం లోనూ, ఇటు తెలుగులోనూ పలు సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘విశ్వంభర’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళం లో అజిత్ తో కలిసి ‘విడాముయార్చి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ, కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది. ఫిబ్రవరి మొదటి వారం లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి.