Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు టాలీవుడ్ లో ధమాకా ఫస్ట్ హిట్. ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ధమాకా చిత్రంతో శ్రీలీల ఎనర్జీకి ఇండస్ట్రీ ఫిదా అయింది. దాంతో ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఇయర్ లో భగవంత్ కేసరి చిత్రంతో మరో హిట్ కొట్టి, కెరీర్ లో దూసుకుపోతుంది. కాగా రవితేజ కొత్త సినిమా ఈగల్ 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ‘ ఈగల్ వర్సెస్ ధమాకా ‘ పేరుతో సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శ్రీలీల పాల్గొన్నారు.
అయితే ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఏడాది మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పెళ్లి సందడి విడుదలకి ముందే తనకు ధమాకా లో నటించే అవకాశం వచ్చిందని హీరోయిన్ శ్రీ లీల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముందుగా అందరికీ థాంక్యూ సో మచ్ .. ఈ సంవత్సరం అంతా మంచి విజయాలు అందుకున్నాను .. ఇదంతా ధమాకా తో స్టార్ట్ అయింది.
ఈ సినిమా నాకు పెళ్లి సందడి రిలీజ్ అవ్వకముందు ముందు వచ్చిన సినిమా. థాంక్యూ సో మచ్ రవితేజ గారు. నాపై నమ్మకం ఉంచినందుకు. ఇంకా నా ప్రోడ్యూసర్స్ విశ్వ గారు, వివేక్ గారు ఎల్లప్పుడూ నాకు సప్పోర్ట్ గా నిలిచారు. మీకు రీల్ ఇంకా రియల్ లైఫ్ లో కూడా థాంక్యూ. అలానే డైరెక్టర్ త్రినాథ్ నక్కిన గారు, ప్రసన్న గారు అందరికీ ధన్యవాదాలు.
ఎంటైర్ టీం, క్యాస్ట్ ఆల్ ది బెస్ట్. అలాగే అందరూ మాస్కులు వేసుకోండి. ఇది కోవిడ్ టైం కూడా. మళ్ళీ స్టార్ట్ అయింది. ప్లీజ్ సేఫ్ గా ఉండండి అంటూ నటి శ్రీ లీల చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ శ్రీలీల మహేష్ బాబుకు జంటగా గుంటూరు కారం మూవీలో కనిపించనుంది. గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.