Heroine Sameera Reddy Mahesh Babu : టాలీవుడ్ లో కొంతమంది తక్కువ సినిమాలే చేసినప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రని వేస్తారు..ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత మంది కుర్ర హీరోయిన్లు ఇండస్ట్రీ లో పుట్టుకొచ్చిన వీళ్ళని మాత్రం ఎవ్వరు మర్చిపోలేరు..అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సమీరా రెడ్డి..బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన సమీరా రెడ్డి తెలుగు లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘నరసింహుడు’ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది,ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి తో జై చిరంజీవ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో అశోక్ వంటి సినిమాల్లో నటించింది..ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్టలేదు, దీనితో ఆమె టాలీవుడ్ లో సినిమాలను పూర్తిగా వదిలేసి బాలీవుడ్ లో స్థిరపడింది..ఆ తర్వాత వరుసగా పది బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె 2014 వ సంవత్సరం లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
సినిమాలకు అయితే గుడ్ బై చెప్పింది, కానీ సోషల్ మీడియా లో తన అభిమానులతో తరచూ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది..రీసెంట్ గా ఆమె ఫ్యాన్స్ తో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మాట్లాడుతూ సినిమాల్లోకి రాకముందు డెస్క్ లో పని చేసేదానిని..1998 వ సంవత్సరం లో మహేష్ బాబు హీరో గా నటించిన ‘రాజకుమారుడు’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ చేసారని,కానీ వాళ్ళు అక్కడ ఇచ్చిన టాస్కు చెయ్యడం లో నేను విఫలం అయ్యానని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.
తొలి సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి తో నటించే అవకాశం పొయ్యినందుకు గాను చాలా ఏడుపు వచ్చిందని, నా జీవితం లో అంతలాగా ఎప్పుడు ఏడవలేదని సమీరా రెడ్డి ఈ సందర్భంగా తెలిపింది.ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.