Homeఎంటర్టైన్మెంట్Heroine Ruksar Dhillon :  దిల్ రూబా ప్రెస్ మీట్ లో హీరోయిన్ ఫైర్, మీరైతే...

Heroine Ruksar Dhillon :  దిల్ రూబా ప్రెస్ మీట్ లో హీరోయిన్ ఫైర్, మీరైతే ఊరుకుంటారా అంటూ.. సూటి ప్రశ్న!

Heroine Ruksar Dhillon : కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ దిల్ రూబా. ఈ చిత్రం మార్చ్ 14న థియేటర్స్ లోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రూబా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ వేడుకకు మీడియాను ఆహ్వానించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రుక్షర్ థిల్లాన్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘ఇక్కడ మహిళలు ఎందరు ఉన్నారు? కొంచెం హ్యాండ్స్ రైజ్ చేయండి. మీకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నా ఎవరైనా ఫోటోలు తీస్తే మీరు ఊరుకుంటారా?.. లేదు కదా… నాకు కంఫర్ట్ గా లేదు. ఫోటోలు తీయకండి అని రిక్వెస్ట్ చేశాను. అయినా ఫోటోలు క్లిక్ చేయడం ఆపలేదు. ఇది సరైనది కాదు,’ అని రుక్షర్ థిల్లాన్ అన్నారు. ఆమెను వెనకనుండి కిరణ్ అబ్బవరం గమనిస్తున్నాడు. సినిమా ఈవెంట్స్ లో హీరో, హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణులను మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తారు. ఇది సహజంగా జరిగేదే. రుక్షర్ థిల్లాన్ కి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు.

Also Read: దిల్ రూబా ట్రైలర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం దంచేశాడు, డైలాగ్స్ అదుర్స్! హైలెట్స్ ఇవే

బహుశా ఇది ప్రమోషనల్ స్టంట్ కూడా కావచ్చు. ఏదేమైనా దిల్ రూబా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రుక్షర్ థిల్లాన్ మాట్లాడిన తీరు చర్చకు దారి తీసింది. రుక్షర్ థిల్లాన్ తెలుగులో అనేక చిత్రాలు చేసింది. తెలుగులో ఆకతాయి ఆమె మొదటి చిత్రం. అనంతరం నానికి జంటగా కృష్ణార్జున యుద్ధం మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఒక హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ కి జంటగా అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ చేసింది. ఆమె కెరీర్లో సరైన హిట్ లేదు.

పెద్దగా ఫేమ్ లేని రుక్షర్ థిల్లాన్ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఇక కిరణ్ అబ్బవరం క మూవీతో మంచి విజయం అందుకున్నాడు. క తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. రూ. 50 కోట్ల గ్రాస్ వరకు రాబట్టి పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. క వంటి బ్లాక్ బస్టర్ అనంతరం కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ఇక దిల్ రూబా మూవీ స్టోరీ అంచనా వేసి చెప్పిన ఒకరికి బైక్ గిఫ్ట్ గా ఇస్తానని కిరణ్ అబ్బవరం ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో హీరోయిన్స్ గా సమంత, రష్మిక..ప్లానింగ్ మాములుగా లేదుగా!

Exit mobile version