Homeఎంటర్టైన్మెంట్Heroine Regina: సమంత బాటలో రెజీనా.. బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోకుండా ఆ పని చేస్తుందట!!

Heroine Regina: సమంత బాటలో రెజీనా.. బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోకుండా ఆ పని చేస్తుందట!!

Heroine Regina: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌. ఇందులో లవ్‌.. రిలేషన్‌షిప్‌ లాంటివి చాలా సాధారణ విషయమని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే కొందరు స్టార్స్‌.. లవ్‌ చేసి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు కెరీర్‌ సాఫీగా ఉందని వివాహం చేసుకోకుండా చాలా ఏళ్లపాటు అలానే ఉండిపోతారు. ఇలాంటి వారిలో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువ. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్‌ రెజీనా కూడా చేరిపోయారు.

Heroine Regina
Heroine Regina

చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్‌ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్‌ మొదల్‌ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది.

లవ్‌.. బ్రేకప్‌
హీరోయిన్‌ రెజీనా అనగానే తెలుగు ప్రేక్షకులకు ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘అ!’, ‘ఎవరు’ తదితర సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు, తమిళంలో దాదాపు 35కి పైగా సినిమాలు చేసింది. ఈ మధ్య ‘ఆచార్య’లో స్పెషల్‌ సాంగ్‌ చేసి అలరించింది. త్వరలో ‘శాకిని డాకిని’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వూలు ఇస్తూ బిజీగా ఉన్న రెజీనా.. లవ్‌.. బ్రేకప్‌.. పెళ్లి గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ఇక పెళ్లి చేసుకోనేమో..
తాను పెళ్లికి రెడీ అనే వార్తలపై స్పందించిన రెజీనా.. 2020లో లవ్‌ ముగిసిందని, దాన్నుంచి బయటపడటానికి సమయం పట్టిందని తెలిపింది. ప్రస్తుతమైతే ఎవరినీ ప్రేమించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రేమ–పెళ్లి విషయాలపై మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదని మ్యారీడ్‌ లైఫ్‌పై వ్యతిరేక భావం వ్యక్తం చేసింది. జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదని చెప్పింది. ఎవరిపై ఆధారపడకుండా బతకడం ఎలానో చిన్నప్పుడే తన తల్లి నేర్పిందని.. ఈ నేపథ్యంలో జీవితంలో తోడు కావాలా వద్దా అనే విషయాలు ఇకపై ఆలోచించని పేర్కొంది.

Heroine Regina
Heroine Regina

వెబ్‌ సీరీస్‌లలో బిజీ..
ఈ మధ్యకాలంలో రెజీనా హీరోయిన్‌గా సినిమాలో నటించకపోయినా పలు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపిన విషయాలను బట్టి అర్థమవుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version