Rashmika Mandanna: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ ఎవరు అని లిస్ట్ తీస్తే కచ్చితంగా రష్మిక మందాన ముందు వరుస లో ఉంటుంది..తెలుగు ,హిందీ,తమిళం,కన్నడ ఇలా అన్ని బాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రష్మిక ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది..తనపై సోషల్ మీడియా లో వస్తున్నా ట్రోల్ల్స్ కి మనస్తాపానికి గురై ఆమె పెట్టిన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఎంతలా వైరల్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఆమెపై ట్రోల్ల్స్ రావడానికి..ఆమె అంతలా బాధపడడానికి ప్రధాన కారణం ‘కాంతారా’ చిత్రం.

పాన్ ఇండియా లెవెల్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా పై సౌత్ లో ఉన్న సెలెబ్రిటీలు మొత్తం ప్రశంసల వర్షం కురిపించారు..రజినీకాంత్ కూడా ఇటీవలే ఈ సినిమాని చూసి మెచ్చుకొని రిషబ్ శెట్టి ని తన ఇంటికి ఆహ్వానించి సన్మానం కూడా చేసాడు..ఇక సౌత్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరూ కూడా ఈ చిత్రం పై స్పందించి ప్రశంసించారు.
కానీ రష్మిక మాత్రం ఈ మూవీ పై స్పందించలేదు..ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘కాంతారా’ మూవీ ఎలా ఉంది అని అడగగా ‘నేనింకా సినిమా చూడలేదు’ అని పొగరుగా సమాధానం ఇస్తుంది..అక్కడి నుండి ఈమెకి కన్నడ ఫాన్స్ నుండి విమర్శల వెల్లువ కురిసింది..కన్నడ సినీ పరిశ్రమ నీకు అన్నం పెట్టింది..అలాంటి కన్నడ సినిమా పరిశ్రమని నువ్వు అవమానిస్తున్నావు..రిషబ్ శెట్టి నీ మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ కి దర్శకుడు..అతను పరిచయం చెయ్యకపోతే అసలు ఎవరు నువ్వు.

నీకు జీవితాన్ని ఇచ్చిన డైరెక్టర్ స్వయంగా హీరోగా చేస్తే రెస్పాన్స్ ఇవ్వడానికి అంత బలుపా నీకు అంటూ కన్నడ ఫాన్స్ ఆమెని సోషల్ మీడియా లో బూతులు తిట్టడం ప్రారంభించారు..అయితే ప్రతి సూపర్ హిట్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చే రష్మిక ‘కాంతారా’ చిత్రం ని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది.
రిషబ్ శెట్టి సోదరుడు రక్షిత్ శెట్టి తో అప్పట్లో రష్మిక ప్రేమాయణం నడిపింది..వీళ్లిద్దరి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం కూడా జరిగింది..కానీ చివరి నిమిషం లో రక్షిత్ శెట్టి తో విభేదాలు ఏర్పడి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక..అప్పటి నుండి వీళ్ళ కుటుంబం తో రశ్మికకి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి..స్నేహంగా కూడా లేరు..అందుకే రష్మిక కాంతారా పట్ల అలా ప్రవర్తించిందని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ లో నడుస్తున్న టాక్.