https://oktelugu.com/

Pranitha Subhash: వైరల్ గా హీరోయిన్ ప్రణీత సుభాష్ సెకండ్ బేబీ ఫోటో… ఎంత క్యూట్ గా ఉన్నాడో మీరే చూడండి!

హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ప్రణీత సుభాష్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రణీత సుభాష్ కొడుకు ఫోటో వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 11, 2024 / 11:53 AM IST

    Pranitha Subhash

    Follow us on

    Pranitha Subhash: హీరోయిన్ ప్రణీత సుభాష్ కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఆమెకు ఛాన్స్ దక్కింది. ముఖ్యంగా అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత సుభాష్ సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్. పవన్ కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో అత్తారింటికి దారేది ఒకటి. సమంత మెయిన్ హీరోయిన్ గా చేసింది. అత్తారింటికి దారేది మూవీ హిట్ కావడంతో… రభస చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది.

    ఎన్టీఆర్ హీరోగా నటించిన రభస మాత్రం డిజాస్టర్ అయ్యింది. అనంతరం రామ్ పోతినేనికి జంటగా హలో గురూ ప్రేమ కోసమే చిత్రంలో నటించింది. ప్రణీత సుభాష్ కెరీర్లో ఎదగలేదు. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. దాంతో 2021లో బెంగుళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది. ప్రణీత వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

    వివాహం అనంతరం కూడా ప్రణీత కొన్ని చిత్రాలు చేసింది. 2022లో ప్రణీత ఓ పాపకు జన్మనిచ్చింది. ఇటీవల మరోసారి ఆమె తల్లి అయ్యారు. ఈసారి ప్రణీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో తన కుమారుడు ఫోటో ఆమె షేర్ చేశారు. మాకు అబ్బాయి జన్మించాడని తెలియజేసింది. ప్రణీత సోషల్ మీడియా పోస్ట్ చూసిన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణీత సుభాష్ కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడు. అందంలో తల్లికి ఏ మాత్రం తీసిపోడు అన్నట్లుగా ఉన్నాడు.

    నటిగా కొనసాగుతూనే ప్రణీత వ్యాపారవేత్తగా కూడా రాణిస్తుంది. కాగా కోవిడ్ సమయంలో ప్రణీత సుభాష్ సామాన్యులకు సేవలు అందించారు. పేదలకు ప్రణీత ఆహారం అందించారు. ప్రణీత సుభాష్ సేవలను అప్పట్లో అందరూ కొనియాడారు. 2024లో ప్రణీత నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగులో 2019 తర్వాత ఆమె మూవీ చేయలేదు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తెలుగు అభిమానులు ఆమెను మిస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంటుంది.