Heroine Poorna: హీరోయిన్ పూర్ణ తన డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాను బట్టలు ధరించేది అందుకు కాదంటూ… సోషల్ మీడియా పోస్ట్ చేశారు. కేరళ భామ పూర్ణ అలియాస్ షామ్నా ఖాసీం కెరీర్ బిగినింగ్ లో కొన్ని మెరుపులు మెరిపించారు. ఆమె హీరోయిన్ గా నటించిన సీమ టపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. హీరోయిన్ గా ఫేమ్ వచ్చినప్పటికీ కెరీర్ కి గట్టి పునాది పడలేదు. పూర్ణ గ్రాఫ్ త్వరగా పడిపోయింది. ప్రస్తుతం పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

క్యారెక్టర్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న పూర్ణ కెరీర్ జోరందుకుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఏడాదికి అరడజనుకు పైగా చిత్రాల్లో పూర్ణ నటిస్తున్నారు. గత ఏడాది పూర్ణ నటించిన అఖండ, దృశ్యం 2 చిత్రాలు విజయం సాధించాయి. బాలయ్య నటించిన అఖండ చిత్రం అయితే ప్రభంజనం సృష్టించింది.

పూర్ణ లేటెస్ట్ తెలుగు రిలీజ్ తీస్ మార్ ఖాన్. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ మూవీలో కీలకమైన రోల్ చేశారు. ఆది సాయి కుమార్ కి ఈ చిత్రం కూడా హిట్ ఇవ్వలేదు. పూర్ణ చేతిలో దసరా వంటి భారీ చిత్రం ఉంది. నాని-కీర్తి సురేష్ నటిస్తున్న దసరా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అలాగే మరో నాలుగైదు చిత్రాల్లో పూర్ణ నటిస్తున్నారు.

అయితే పెళ్ళైపోయిందని చెప్పి పూర్ణ సడన్ షాక్ షాక్ ఇచ్చారు. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షాహీన్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం జరిగిన విషయం చెప్పిన పూర్ణ… పెళ్లి రహస్యంగా చేసుకుంది. 2022 జూన్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిగిందని చెప్పి మైండ్ బ్లాక్ చేసింది. కొన్ని కారణాల వలన పెళ్లి నిరాడంబరంగా ముగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

పెళ్లి తర్వాత కూడా పూర్ణ నటిగా కొనసాగుతున్నారు. కాగా పూర్ణ లేటెస్ట్ సోషల్ మీడియా కామెంట్ వైరల్ అవుతుంది. నాకు స్టైల్, సౌకర్యమే ముఖ్యం. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నేను బట్టలు ధరించను, అని కామెంట్ పోస్ట్ చేశారు. పూర్ణ యాటిట్యూడ్ తెలియజేసేలా ఉన్న ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. నా డ్రెస్ నా ఇష్టం. ఎవరి అభిప్రాయంతో పనిలేదని పూర్ణ చెప్పకనే చెప్పింది. పూర్ణ మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు.
View this post on Instagram