Heroine Poorna: హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది హీరోయిన్ పూర్ణ. అసలు తగ్గేదేలే అంటూ గ్లామర్ ట్రీట్ తో మనసులు దోచేసింది. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి చిలిపి కళ్ళతో వల విసిరింది. పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ కాగా… ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

ఇక హీరోయిన్ గా రిటైర్ అయిన పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె స్టార్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అడపాదడపా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆమెకు క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. దృశ్యం 2, అఖండ చిత్రాల్లో పూర్ణ మంచి పాత్రలు దక్కించుకున్నారు.

ఒక ప్రక్క కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు వివాహానికి సిద్ధమైంది. కొద్దిరోజుల క్రితం కాబోయేవాడిని పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ అనే బిజినెస్ మాన్ ని పూర్ణ వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పెళ్లి క్యాన్సిల్ అంటూ వార్తలు రాగా… షానిద్ తో దిగిన ఓ రొమాంటిక్ ఫోటో విడుదల చేసి, రూమర్స్ కి చెక్ పెట్టింది.

ఈ ఏడాది చివర్లో పూర్ణ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. అలాగే బుల్లితెర ప్రేక్షకులను నిరాశపరచకుండా స్పెషల్ ఈవెంట్స్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో తళుక్కున మెరుస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ 13 జడ్జిగా వ్యవహరించిన పూర్ణ, అక్కడ సంచలనాలు నమోదు చేశారు. యాకర్స్ నుండి డాన్సర్స్ వరకూ అందరితో మొహమాటం లేకుండా రొమాన్స్ చేశారు.

ప్రస్తుత సీజన్ నుండి ఆమెను తొలగించిన విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్ తో పాటు రష్మీ గౌతమ్ కూడా ఢీ 14 నుండి వెళ్లిపోయారు. ప్రియమణి మాత్రమే జడ్జి సీటులో కొనసాగుతున్నారు. స్టార్ హీరోయిన్ హోదా పొందలేకపోయినా బుల్లితెర, వెండితెరపై సందడి చేస్తూ కెరీర్ నెట్టుకొస్తోంది.
[…] […]