Payal Rajput: అందం, అద్భుతమైన నటన ఉన్న హీరోయిన్లు ఈ కాలం లో దొరకడం చాలా కష్టం. ఒకరికి అందం ఉంటే నటన ఉండదు , మరొకరికి నటన ఉంటే అందం ఉండదు. రెండు ఉన్న హీరోయిన్లు చాలా అరుదుగా ఇండస్ట్రీ లో ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు పాయల్ రాజ్ పుత్(Payal Rajput). ‘RX 100’ చిత్రం తో టాలీవుడ్ ఆడియన్స్ కి ఈమె పరిచయం అయ్యింది. తొలి చిత్రం లోనే నటనకు ప్రాధాన్యత ఉన్న విలన్ క్యారెక్టర్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. సాధారణంగా ఏ హీరోయిన్ కూడా కెరీర్ ఆరంభంలో విలన్ రోల్స్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు విలన్ గా ఉండిపోతారు, హీరోయిన్ గా భవిష్యత్తులో అంగీకరించరు అనే భయం ఉంటుంది. కానీ పాయల్ రాజ్ పుత్ ధైర్యం చేసి ‘RX 100’ చేసింది.
ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, పాయల్ రాజ్ పుత్ కి మంచి పేరు కూడా వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రభావం తదుపరి చిత్రాలపై బలంగా పడింది. ఫలితంగా ఆమె అన్నీ అలాంటి పాత్రలే రావడం మొదలు పెట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం రాలేదు. అయితే పాయల్ రాజ్ పుత్ ఇమేజ్ ని మార్చిన చిత్రం ‘మంగళవారం’. ;లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా తో పాయల్ భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె చేస్తున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. ముని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక ఆదివాసీ మహిళా, తనకు జరిగిన అన్యాయానికి ప్రతీ కారం ఎలా తీర్చుకున్నది అనేదే ఈ సినిమా స్టోరీ . కేవలం తెలుగు లోనే కానీ, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా అందరి సెలబ్రిటీలపై ఏ విధమైన నెగిటివ్ కామెంట్స్ వస్తాయో, పాయల్ రాజ్ పుత్ పై కూడా అలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కెరీర్ మొత్తం ఫ్లాపులే, ఇక నీ కెరీర్ అయిపోయింది, సినిమాలు ఆపేయ్ అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేసాడు. దానికి పాయల్ రాజ్ పుత్ సమాధానం చెప్తూ ‘నన్ను సినిమాలు మానేయమని కొందరు చాలా బలంగా కోరుకుంటున్నారు. నేను కూడా ఒక్క క్షణం ఆలోచించాను. ఈ ఇండస్ట్రీ లో 12 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తే వచ్చిన గుర్తింపు ఇది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఈ ఇండస్ట్రీ ని వదిలేది లేదు, ఇక్కడే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది పాయల్.