Heroine Oriented Films: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా వాళ్లను చూసే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు. కాబట్టి వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగానే దర్శకులు కథను డిజైన్ చేస్తూ డైరెక్షన్ చేస్తూ వాళ్లకి ఎలివేషన్స్ ఇస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళ క్యారెక్టర్లు ఏ మాత్రం తగ్గినా కూడా వాళ్ళ అభిమానులు ఒప్పుకోరు. కాబట్టి మన దర్శకులు సైతం హీరోల ఇమేజ్ ను మైండ్ లో పెట్టుకొని కథలను రాస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వచ్చి మంచి సక్సెస్ లను సాధించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయశాంతి (Vijaya Shanthi) లాంటి నటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ఎక్కువగా చేస్తూ హీరోలకు భారీ పోటీ అయితే ఇచ్చింది. దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ (Osey Ramulamma) సినిమాతో ఒక స్టార్ హీరో కి ఏ రేంజ్ లో అయితే ఇమేజ్ ఉంటుందో అంతటి ఇమేజ్ ని సంపాదించుకున్న నటి కూడా తనే కావడం విశేషం…ఇక ఆమె తర్వాత అనుష్క లాంటి నటి సైతం అరుంధతి(Arundhatho), పంచాక్షరి (Panchakshari) లాంటి సినిమాలతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ట్రై చేసింది. అరుంధతి ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అయినప్పటికి ఆమె ఆ తర్వాత అంతటి సక్సెస్ లను కంటిన్యూ చేయలేక పోయింది.
Also Read: మోడీ నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందా?
అందువల్లే ఆమె వెనుకబడిపోయింది. మరి ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్దగా అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే ప్రతి ఒక్కరు స్టార్ హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలను రాసుకుంటూ వాళ్ళతోనే సినిమాలు చేస్తు భారీ కలెక్షన్స్ కి కొల్లగొడుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా మరోసారి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు తెరలేపితే బాగుంటుంది అని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… కానీ ప్రొడ్యూసర్లు మాత్రం హీరోలు లేకుండా హీరోయిన్లను నమ్మి సినిమా మీద బడ్జెట్ పెట్టే అవకాశాలైతే లేవు. కారణం ఏంటి అంటే ఇంతకు ముందున్న హీరోలతో పోలిస్తే ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక ప్రేక్షకుడు వీక్షిస్తున్నాడు.
కాబట్టి ఇప్పుడు భారీ విజువల్ వండర్స్ గా సినిమాలను తెరకెక్కిస్తే తప్ప ప్రేక్షకులు ఆ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. అంత భారీ బడ్జెట్ ని పెట్టి బడ్జెట్ రికవరీ చేయాలంటే అంతకు మించిన స్టార్ డమ్ ఉన్న హీరో అయితే కావాలి. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలి అంటే ప్రొడ్యూసర్లు, దర్శకులు భయపడిపోతున్నారు. మరి ఫ్యూచర్ లో అయిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…