Nikesha Patel: హీరోయిన్ నికీషా పటేల్ అభిమానులకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. ఇడుగో నాకు కాబోయేవాడంటూ విదేశీయుడిని పరిచయం చేసింది. దీపావళి పండగ సందర్భంగా నికీషా అభిమానులను సర్ప్రైజ్ చేసింది. కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా పెళ్లి చేసుకొని సెటిల్ కావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఏ హీరోయిన్ కి లభించని అరుదైన అవకాశం నికీషా పటేల్ కి దక్కింది. పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కించుకుంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పులి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

ఖుషి వంటి బ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా మాత్రం నిరాశపరిచింది. పులి సినిమాలో నికీషా పటేల్ మధుమతిగా నటించి మెప్పించారు. తర్వాత నికీషాకు తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ కి జంటగా ‘ఓం’ మూవీలో నటించారు. అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో నికీషాకు తెలుగులో ఆఫర్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి.
కాగా నికీషా కన్నడ, తమిళ పరిశ్రమలల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. వరుసగా కొన్ని చిత్రాలు చేశారు. అక్కడ కూడా నికీషాకు బ్రేక్ రాలేదు. స్టార్ హీరోయిన్ ని చేసే సినిమా పడలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి తెలుగులో అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ వంటి చిన్న చిత్రాల్లో నటించారు. 2019లో విడుదలైన తమిళ చిత్రం మార్కెట్ రాజా ఎంబిబిఎస్ లో చివరి సారిగా నికీషా పటేల్ నటించారు. కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా తెలివైన నిర్ణయం తీసుకుంది.

సడన్ గా తన ప్రియుడిని పరిచయం చేసింది.అతనిని వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించింది . ఇక నికీషాను వివాహం చేసుకోబోయేవాడు విదేశీయుడని తెలుస్తుంది. అతనితో క్లోజ్ గా దిగిన ఫోటో షేర్ చేసిన నికీషా పటేల్… అధికారికంగా తనతో రిలేషన్ పై స్పష్టత ఇచ్చింది. ఇక నికీషాను వివాహం చేసుకోయే ఆ వ్యక్తి ఏ దేశస్తుడు. ఏం చేస్తుంటాడనే వివరాలు తెలియాల్సి ఉంది. పండగ వేళ నికీషా కాబోయేవాడిని పరిచయం చేసి సర్ప్రైజ్ కి గురి చేసింది. ఇక ఆమె అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసిస్తున్నారు. నికీషా పటేల్ పెళ్లి వార్త మీడియాలో హైలెట్ గా నిలిచింది.