https://oktelugu.com/

Nidhhi Agerwal: విచిత్రంగా మారిన హీరోయిన్ నిధి అగర్వాల్ పరిస్థితి.. చేతినిండా పెద్ద హీరోల సినిమాలున్నాయి..కానీ!

Nidhhi Agerwal: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు, ఆమె పుట్టినరోజు ని అభిమానులు ఒక స్టార్ హీరోకి ఎలా అయితే సంబరాలు చేస్తారో, ఆ రేంజ్ లో కొన్ని ప్రాంతాలలో సంబరాలు చేస్తుంటారు. ఒక చోట ఆమెకి విగ్రహం కూడా కట్టిన సందర్భాలు చూసాము. యూత్ లో ఇంత […]

Written By:
  • Vicky
  • , Updated On : June 22, 2023 / 09:28 AM IST

    Nidhhi Agerwal

    Follow us on

    Nidhhi Agerwal: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు, ఆమె పుట్టినరోజు ని అభిమానులు ఒక స్టార్ హీరోకి ఎలా అయితే సంబరాలు చేస్తారో, ఆ రేంజ్ లో కొన్ని ప్రాంతాలలో సంబరాలు చేస్తుంటారు. ఒక చోట ఆమెకి విగ్రహం కూడా కట్టిన సందర్భాలు చూసాము.

    యూత్ లో ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో ఆశించిన స్థాయి రాలేదే అనే బాధ అభిమానుల్లో ఉండేది. ఎల్లపుడూ మీడియం రేంజ్ హీరోల సినిమాలే చేస్తుంది, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం రావడం లేదు ఎందుకు వంటి సందేహాలు అభిమానుల్లో ఉండేవి. అయితే ఎట్టకేలకు ఆమెకి కాలం కలిసొచ్చి పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది.

    ప్రభాస్ మరియు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ హారర్ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ సంపాదించింది. ఈ రెండు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇవి విడుదల ఎప్పుడు అయ్యేది అనేది ఎవ్వరూ కనిపెట్టలేకున్నారు.

    ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ K చిత్రం లో నటిస్తూ బిజీ గా ఉండగా, ఖాళి సమయం లో మారుతి చిత్రాన్ని చేస్తున్నాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి తాత్కాలిక విరామం ఇచ్చి, వేరే సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ టూర్స్ లో కూడా బిజీ గా ఉన్నాడు, ఈ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండి, విడుదల తేదీ ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఇలా రెండు సినిమాలు హోల్డ్ ఉండడం తో నిధి అగర్వాల్ పరిస్థితి ఎవరూ అంచనా వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది.