Heroine Meenakshi Seshadri: 80-90లలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మీనాక్షి సింహాద్రి వెలిగారు. 1983లో మీనాక్షి వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం హీరో. జాకీ ష్రాఫ్ హీరోగా నటించారు. అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు టాప్ స్టార్స్ తో మీనాక్షి సింహాద్రి నటించారు. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన మీనాక్షిని సీనియర్ ఎన్టీఆర్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. 1991లో ఎన్టీఆర్ చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ చేశారు. ఈ మూవీలో మీనాక్షి శేషాద్రి కీలక రోల్ చేశారు.

ఆమెకు తెలుగులో గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం ఆపద్భాంధవుడు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జంధ్యాల మాటలు అందించారు. మాస్ హీరోగా చిరంజీవిగా వెలిగిపోతున్న రోజుల్లో ఆయన ఇమేజ్ కి భిన్నంగా తెరకెక్కిన చిత్రం ఆపద్బాంధవుడు. దీంతో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు అంగీకరించలేదు. కీరవాణి పాటలు మాత్రం పాపులర్ అయ్యాయి.
ఆపద్బాంధవుడు మూవీలో మీనాక్షి మెంటల్ పేషెంట్ గా నటించారు. ఈ చిత్రంలోని నటనకు గానూ మీనాక్షి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యారు. ఇక మీనాక్షి స్టార్ సింగర్ కుమార్ సానుతో డేటింగ్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె వ్యాపారవేత్త హరీష్ మైసూర్ ని 1995లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం మీనాక్షి వెండితెరకు దూరమయ్యారు.

చాలా గ్యాప్ తర్వాత 2016లో గాయల్ ఒన్స్ అగైన్ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ గ్యాప్ తీసుకొని వెండితెరకు దూరమయ్యారు. అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. కెరీర్లో అనేక పాత్రలు చేసిన నేను ఎలాంటి రోల్ అయినా చేయగలను అనే నమ్మకం నాకుంది అంటున్నారు. అలాగే ఒకే రకం పాత్రలకు పరిమితం కాకుండా భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఆపద్భాంధవుడు మూవీ తర్వాత మీనాక్షి మళ్ళీ తెలుగులో మూవీ చేయలేదు. మీనాక్షి ప్రస్తుత వయసు 59 సంవత్సరాలు.