https://oktelugu.com/

Heroine Madhu Shalini Marriage: సీక్రెట్ గా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన యంగ్ హీరోయిన్!

Heroine Madhu Shalini Marriage: హీరోయిన్ మధుశాలిని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆమె వివాహ తంతు చడీ చప్పుడు లేకుండా ముగిసింది. వివాహం అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేసింది. తమిళ నటుడు గోకుల్ ఆనంద్ మధుశాలిని మెడలో తాళికట్టాడు. జూన్ 16 గురువారం గోకుల్ ఆనంద్-శాలిని వివాహం హైదరాబాద్ లో బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. ఇక మధుశాలిని తన ట్విట్టర్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలు పంచుకోగా […]

Written By: , Updated On : June 18, 2022 / 10:43 AM IST
Follow us on

Heroine Madhu Shalini Marriage: హీరోయిన్ మధుశాలిని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆమె వివాహ తంతు చడీ చప్పుడు లేకుండా ముగిసింది. వివాహం అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేసింది. తమిళ నటుడు గోకుల్ ఆనంద్ మధుశాలిని మెడలో తాళికట్టాడు. జూన్ 16 గురువారం గోకుల్ ఆనంద్-శాలిని వివాహం హైదరాబాద్ లో బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. ఇక మధుశాలిని తన ట్విట్టర్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలు పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. మధుశాలిని వివాహ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Heroine Madhu Shalini Marriage

Heroine Madhu Shalini

అభిమానుల ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగుపెడుతున్నాను. ఇకపై కూడా మీ ఆదరాభిమానాలు ఇలానే కొనసాగాలి… అంటూ ఓ ఎమోషనల్ నోట్ మధుశాలిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మధుశాలిని-గోకుల్ ఆనంద్ మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధుశాలిని, గోకుల్ ఆనంద్ తమిళ చిత్రం పంచాక్షరం లో కలిసి నటించారు. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Also Read: Balakrishna- Mohan Babu: మోహన్ బాబు, బాలయ్య.. ఆ సినిమా ఎందుకు వదులుకున్నాడు?

కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న మధుశాలిని-గోకుల్ ఆనంద్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక మధుశాలిని కుటుంబ నేపథ్యం గమనిస్తే ఆమె బిజినెస్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కిన అందరివాడు మూవీతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అల్లరి నరేష్ కితకితలు చిత్రంలో మధుశాలిని సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా… పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది.

Heroine Madhu Shalini Marriage

Heroine Madhu Shalini

జగడం, వాడు వీడు, గోపాల గోపాల, కింగ్, గూఢచారి వంటి హిట్ చిత్రాల్లో మధుశాలిని నటించడం జరిగింది. హీరోయిన్ గా ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ప్రేమించినవాడిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది.

Also Read:NTR30 Release Date: NTR30 విడుదల తేదీ వచ్చేసింది.. అభిమానులకు ఇక పండగే

Tags