Kiara Advani Daughter Name: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ(Kiara Advani). ఈమెకు సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, ఈ రేంజ్ క్రేజ్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు, చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఈమె ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని ప్రేమించి పెళ్లాడడం అందరినీ ఎంతో సర్ప్రైజ్ కి గురి చేసింది. రీసెంట్ గానే ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. ఈ విషయాన్నీ కియారా అద్వానీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే ఈ పాపకు సరాయా మల్హోత్రా అనే పేరు పెట్టినట్టు నేడు అధికారిక ప్రకటన చేసింది.
ఈ పేరులో ఉన్న గమ్మత్తు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సిద్దార్థ్ మల్హోత్రా పేరులోని మొదటి అక్షరం ‘స’, కియారా అద్వానీ పేరులోని ‘యారా’ అక్షరాలను కలుపుకొని ‘సయారా’ అని పెట్టారట. ‘సయారా’ అంటే అరబిక్ భాషలో యువరాణి అని అర్థం అట. తల్లితండ్రుల పేర్లలో అక్షరాలను తీసుకొని, దానికి అద్భుతమైన అర్థం వచ్చేలా పేరు పెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది కదూ. అయితే అందరి సెలబ్రిటీలు లాగానే, వీళ్లిద్దరు కూడా తమ పాప ముఖాన్ని చూపించడానికి అసలు ఇష్టపడలేదు. కేవలం ఆ చిన్నారి తొడుగుకున్న సాక్సులు మాత్రమే చూపించారు. కానీ పెరిగి కొద్దిగా పెద్దయ్యాక మాత్రం కచ్చితంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీపికా పదుకొనే కూడా పాప పుట్టిన కొత్తల్లో ఇలాగే ఆ చిన్నారి ముఖం లీక్ అవ్వకుండా చూసుకుంది, కానీ రీసెంట్ గానే ఆమె దీపావళి సందర్భంగా తన చిన్నారి ముఖాన్ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. కియారా కూడా ఇలాగే చేస్తుందేమో అని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, కియారా అద్వానీ ప్రస్తుతం కన్నడ సూపర్ స్టార్ యాష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే చిత్రం లో నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన గేమ్ చేంజర్, వార్ 2 చిత్రాలు ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాక్సిక్ చిత్రం తర్వాత ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. ఇక సిద్దార్థ్ మల్హోత్రా విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన జాన్వీ కపూర్ తో కలిసి పరం సుందరి అనే చిత్రం ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇప్పుడు ప్రస్తుతం అయన ‘వాన్; ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు.