Ketika Sharma: సాలిడ్ గ్లామర్ కి కేతిక శర్మ పెట్టింది పేరు. ఈ యంగ్ బ్యూటీ మొదటిసారి కేజ్రీ ఆఫర్ పట్టేసింది. బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించింది. పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర చేయగా బ్రో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. పవన్ కళ్యాణ్ మూవీలో నటించడంతో కేతిక శర్మకు రీచ్ లభించింది. ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తించే అవకాశం దక్కింది. అయితే కథ రీత్యా బ్రో మూవీలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత అంతంత మాత్రమే. చెప్పాలంటే బ్రో ఆమె కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్.
కేతిక శర్మ కెరీర్ మోడల్ గా మొదలైంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఆకాష్ పూరి హీరోగా విడుదలైన రొమాంటిక్ మూవీలో కేతిక నటించింది. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి నిర్మించింది. ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన రొమాంటిక్ యూత్ ని కొంత మేర ఆకట్టుకుంది. కేతిక, ఆకాష్ పూరి సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపోయారు. హద్దులు దాటి రొమాన్స్ చేశారు.
అయితే రొమాంటిక్ కమర్షియల్ గా ఆడలేదు. దాంతో ప్లాప్ మూటగట్టుకుంది. రెండో చిత్రంగా లక్ష్య చేసింది. నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. నాగ శౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ రోల్ చేశాడు. ఈ మూవీపై విడుదలకు ముందు హైప్ ఏర్పడింది. నాగ శౌర్య సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే కంటెంట్ లేకపోవడంతో మూవీ నిలబడలేదు. లక్ష్య సైతం నిరాశపరిచింది.
ఇక మూడు సినిమా రంగ రంగ వైభవంగా. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. తమిళ దర్శకుడు గిరీశాయ దర్శకత్వం వహించాడు. కేతిక కెరీర్లో రంగ రంగ వైభవంగా మరో డిజాస్టర్ అయ్యింది. అలా హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసింది అమ్మడు. అయినప్పటికీ బ్రో మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది.
View this post on Instagram