‘హీరోయిన్ కమ్ నిర్మాత’ పెళ్లి పై మళ్ళీ పుకారు !

ఆమె హాట్ నెస్ కి కుర్రాళ్ళు షేక్ అయిపోయారు. పైగా స్టార్ హీరోల నుంచి మొదలు పెడితే కుర్ర హీరోల వరకూ ఆమె అందరి సరసన రెచ్చిపోయి నటించి అదరగొట్టింది. కానీ చూస్తుండగానే కాలం కరిగిపోయింది. అయితే, చిన్న వయసులోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా వయసు ఉండగానే ఆమెకు క్రేజ్ తగ్గింది. క్రేజ్ పోయినా ఆమె మాత్రం ఇండస్ట్రీని వీడలేదు. పోనీ పెళ్లి చేసుకొని సెటిల్ అయిందా అంటే అదీ లేదు. ఇప్పటికీ […]

Written By: admin, Updated On : June 8, 2021 6:31 pm
Follow us on

ఆమె హాట్ నెస్ కి కుర్రాళ్ళు షేక్ అయిపోయారు. పైగా స్టార్ హీరోల నుంచి మొదలు పెడితే కుర్ర హీరోల వరకూ ఆమె అందరి సరసన రెచ్చిపోయి నటించి అదరగొట్టింది. కానీ చూస్తుండగానే కాలం కరిగిపోయింది. అయితే, చిన్న వయసులోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా వయసు ఉండగానే ఆమెకు క్రేజ్ తగ్గింది. క్రేజ్ పోయినా ఆమె మాత్రం ఇండస్ట్రీని వీడలేదు. పోనీ పెళ్లి చేసుకొని సెటిల్ అయిందా అంటే అదీ లేదు.

ఇప్పటికీ ఇండస్ట్రీలోనే కొనసాగాలని నిర్ణయించుకుని, ఓ డైరెక్టర్ తో నిర్మాణ రంగంలో భాగస్వామ్యం తీసుకుని ఆ విధంగా ముందుకు పోతుంది. ఈ క్రమంలో ఆమె పెళ్లి పై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె పెళ్లి పై మళ్ళీ ఇండస్ట్రీలో ఓ వార్త వినిపిస్తోంది. ఆమెను వివాహ బంధంలోకి నెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్ కోసమైనా ఈ ముదురు భామ పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపిస్తోందా ? లేక ఎప్పటిలాగే తనకు పెళ్లి ఎందుకు అంటుందా ?. నిజానికి ‘మీ పెళ్లి సంగతేంటి?’ అంటూ సోషల్ మీడియాలో ఆమెను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నలకు కూడా ఆమె ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూనే ఉంది. అసలు తనకు పెళ్లి అవసరం లేదనేది ఈ మాజీ హీరోయిన్ వాదన.

ఈ వాదనలో కూడా వాస్తవం ఉందిలేండి. మరి ఈ భారీ బ్యూటీ ఓ బోల్డ్ డైరెక్టర్ తో డైరెక్ట్ గానే సహజీవనం చేస్తోంది. ఈ జంట పై అనేక రకాలుగా విమర్శలు కూడా వచ్చాయి. వాటిని ఈమె ఎలాగూ పట్టించుకోదు, ఇక ఆ డైరెక్టర్ అయితే అసలే పట్టించుకోడు. అందుకే ఈ జంట పై పుకార్లు పుట్టించే వాళ్ళు కూడా విసిగిపోయారు. ఇండస్ట్రీ కూడా ఈ జంటను పట్టించుకోవడం మానేసింది. కానీ ఆమె పేరెంట్స్ మాత్రం ఆమెను పెళ్లి విషయంలో బలవంత పెడుతున్నారు.