Ameesha Patel (1)
Ameesha Patel: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు అమీషా పటేల్. 2000 దశకంలో ఈమెకి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ప్రతీ ఒక్కరు అప్పట్లో తమకు అమీషా పటేల్ లాంటి హీరోయిన్ రావాలని కోరుకునేవారు. అలా యువతకు కలల రాణిగా మారిన ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘బద్రి’ చిత్రం ద్వారా పరిచయమైంది. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఆమె మహేష్ బాబు తో ‘నాని’, ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’ వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘అప్పుడప్పుడు నేను అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు #AskAmeesha లాంటివి ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో పెడుతుంటాను. అభిమానులు ఎన్నో వింత ప్రశ్నలు అడిగేవారు. కొంతమంది అయితే మీకు, సల్మాన్ ఖాన్ కి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు కదా, మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగేవారు. అభిమానులకి ఎన్నో కోరికలు ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో అవన్నీ వర్కౌట్ అవ్వవు అని సమాధానం చెప్పాను. మరికొంతమంది నెటిజెన్స్ అయితే మీరు చాలా అందంగా ఉంటారు, సల్మాన్ ఖాన్ కూడా అందంగా ఉంటారు, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలకు జన్మనిస్తారు అని కామెంట్స్ చేసారు. దానికి నేను నవ్వుతూనే నిజమే కదా, అందమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు అంటూ సమాధానం ఇచ్చాను’ అని చెప్పుకొచ్చింది.
Ameesha Patel
5 పదుల వయస్సు దాటినా అమీషా పటేల్ ఇప్పటికీ సినిమాల్లో యాక్టీవ్ గా ఉంటుంది. 2023 వ సంవత్సరం లో ఆమె బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి చేసిన ‘గద్దర్ 2’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనమంతా చూసాము. గత ఏడాది ఆమె ‘తౌబా తేరా జల్వా’ అనే చిత్రం లో కూడా ఒక హీరోయిన్ గా నటించింది. 2018 వ సంవత్సరం వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన అమీషా పటేల్, 5 ఏళ్ళ విరామం తర్వాత ‘గద్దర్ 2 ‘ తో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా, నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం గా ఉంది. మరి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.