Nayan bday: చంద్రముఖి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నయనతార. తమిళ తెలుగు మలయాళ అగ్ర హీరోలందరితో నటించి ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. అలానే లేడీ ఓరియెంటెడ్ పాత్రలో సక్సెస్ అయ్యి దాదాపు 80 చిత్రాలకు పైగా నటించి విజయ బాటలో దూసుకు వెళుతూ సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు నేడు పుట్టినరోజు సందర్భంగా నయనతార నటనా జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం.

నయనతార పూర్తి పేరు డయానా స్వగ్రామం కేరళ నయనతారకు మొదటి నుండి మోడలింగ్ అంటే చాలా ఇష్టమట అయితే అనుకోకుండా మలయాళంలో “మనసునక్కరే” అనే సినిమా సినిమాలో నటించింది ఆ సినిమా విజయం అవడంతో అక్కడి నుంచి వరుస విజయాలు అందుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్ల పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న అగ్రకథానాయికగా వెలుగుతున్నారు నయనతార.
గత కొన్నాళ్లుగా తమిళ యువ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమ లో ఉన్నారు ఈ అమ్మడు అయితే ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నారంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.ఇటీవల ఓటిటి వేదికగా డిస్నీహాట్ స్టార్ లో విడుదలైన “నేత్రికన్” మంచి విజయం అందుకుంది.దీపావళి కానుకగా విడుదలైన” పెద్దన్న “సినిమా లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తన నటనతో మెప్పించారు నయనతార. ప్రస్తుతం విజయ్ సేతుపతి తో “కాతు వాకుల రెండు కాదల్ “షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు.ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో సింహ ,మెగాస్టార్ తో ఆటో జానీ కొత్త ప్రాజెక్టులు చేయనున్నారు ఈ ముద్దుగుమ్మ.